ఐపీఎల్ ఫైనల్పై ఫిక్సింగ్ ఆరోపణలు

ఐపీఎల్ 2022 సీజన్ ఘనంగా ముగిసింది. ఈ సారి కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని సాధించింది. ఫైనల్లో రాజస్తాన్ రాయల్స్ను ఓడించి..ఆడిన తొలి సీజన్లోనే టైటిల్ను సొంతం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులే చేసింది. బట్లర్ 39 పరుగులు సాధించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. ఆ తర్వాత గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లే నష్టపోయి 133 రన్స్ చేసి గెలుపొందింది.


ఫైనల్ మ్యాచ్పై ఫిక్సింగ్ ఆరోపణలు..
ఐపీఎల్ 2022 ఫైనల్ మ్యాచ్పై అభిమానులు ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ స్టేడియంలో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ సార్లు గెలిచింది. అయితే ఇది తెలిసి కూడా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్..బ్యాటింగ్ ఎంచుకోవడం అనుమానాలకు తావిస్తోందని చెబుతున్నారు.అంతేకాదు..ఈ సీజన్లో గుజరాత్ ఛేజింగ్లోనే ఎక్కువ విజయాలు సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడే ఓటమి పాలైంది. ఇది తెలిసే.. కావాలనే..శాంసన్ ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడంటున్నారు. లీగ్ దశలో టైటాన్స్ 10 విజయాలు సాధిస్తే..అందులో ఏడు సార్లు ఛేజింగ్ చేసే గెలిచింది. ఓవరాల్గా నాలుగు మ్యాచుల్లో పరాజయం చవిచూడగా..మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. ఫస్ట్ క్వాలిఫయర్ లో రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ గుజరాత్..టాస్ గెలిచి ఫీల్డింగే ఎంచుకోవడం గమనార్హం.

వికెట్ పేసర్లకు అనుకూలంగా ఉన్నా...
ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవాలని ఫ్యాన్స్ భావించారు. ముందుగా గుజరాత్ బ్యాటింగ్ చేస్తే..RR ఈజీగా ఛేజ్ చేస్తుందని కలలు కన్నారు. అనుకున్నట్లుగానే శాంసన్ టాస్ గెలవడంతో..ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. కానీ ఆశలను అడియాశలు చేశాడు. అనూహ్యంగా శాంసన్..బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే పిచ్ డ్రైగా ఉండటంతోనే తాను బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నట్లు టాస్ గెలిచిన తర్వాత సంజూ వెల్లడించాడు. ఆ తర్వాత పిచ్ కొద్దిగా పేసర్లకు అనుకూలంగా ఉందని బౌలింగ్ పడ్డాకా తెలిసింది. అనూహ్య బౌన్స్తో రాజస్థాన్ బ్యాట్సమన్ ఇబ్బందులు పడ్డారు. అంత అనుభవం ఉన్న సంజూ శాంసన్..టాస్ గెలిచి..బ్యాటింగ్ ఎంచుకోవడం ఏంటని నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫైనల్ ఫిక్స్ అయిందని ఆరోపణలు చేస్తున్నారు. 

రాజస్థాన్ తక్కువ స్కోరు చేయడమేంటి..?
ఈ సీజన్లో రాజస్తాన్ 17 మ్యాచులు ఆడింది. ఈ మ్యాచులన్నింటిలోనూ దాదాపు రాజస్తాన్ ఆవరేజ్ స్కోరు 150 పైనే ఉంది. అయితే బెంగుళూరుతో ఏప్రిల్ 26న జరిగిన మ్యాచులో మాత్రమే రాజస్తాన్ 144 పరుగులు సాధించింది. అందులోనూ గెలిచింది. ఫైనల్లో మాత్రం అతి తక్కువ స్కోరు చేయడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు అభిమానులు.  దీనికి తోడు..ఈ సీజన్ లో బట్లర్ సూపర్ ఫాంలో ఉన్నాడు. ఓవరాల్గా ఐపీఎల్ 2022లో అతనే టాప్ స్కోరర్. అయితే ఫైనల్లో బట్లర్ ఐదు ఫోర్లు మాత్రమే కొట్టాడు. కానీ ఒక్కసిక్స్ కూడా కొట్టలేకపోయాడు. బట్లర్ మరోసారి చెలరేగుతాడు అనుకుంటే..కీలక మైన మ్యాచులోనే అతను విఫలవడం..ఫిక్సింగ్ అయిందనడానికి మరోక కారణం అని చెబుతున్నారు. 

హర్ట్ అయిన ఫ్యాన్స్ మీమ్స్తో ట్రోల్..
ఐపీఎల్ 2022 ఫైనల్ ఫిక్సందయనే నిర్ణయానికి వచ్చేశారు అభిమానులు. ఈ క్రమంలోనే ఫైనల్పై ఘాటుగా స్పందిస్తున్నారు. మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. #Fixing అనే హ్యాష్ ట్యాగ్తోతమ కోపాన్ని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తున్నారు.