CJI తన కేసును తానే విచారణ చేయడం న్యాయమేనా?

CJI తన కేసును తానే విచారణ చేయడం న్యాయమేనా?

సాక్షాత్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై వచ్చిన వేధింపుల ఆరోపణలను విచారించడానికి ఏర్పాటు చేసిన బెంచ్ లో అదే చీఫ్ జస్టిస్ఉండటం న్యాయమేనా అనే ప్రశ్న తెరమీదకు వచ్చింది. ‘రూల్ ఆఫ్ లా ’ ను చీఫ్ జస్టిస్ పక్కన పెట్టారన్న విమర్శలు జోరందుకున్నాయి. వివాదం నేపథ్యంలో న్యాయవ్యవస్థకు చెందిన వారు రెండుగా విడిపోయినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జీలందరూ జస్టిస్ గొగొయ్ వైపు నిలబడగా ఆయన వ్యవహరించిన తీరును కొంతమంది సీనియర్ లాయర్లు, న్యాయరంగా నిపుణులు తప్పు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరును ఇద్దరు సుప్రీం కోర్టు లాయర్లు తప్పుపట్టారు. బార్ కౌన్సిల్ వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదంటూ చైర్మన్ కు ఇద్దరు లాయర్లు బహిరంగ లేఖ రాశారు.

 

ఒకవైపు తనపై వచ్చిన ఆరోపణల వెనుక కుట్ర ఉందని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గొగొయ్ ఆవేదన వ్యక్తం చేస్తుంటే మరో వైపు ఆరోపణలకు సుప్రీంకోర్టు కూడా అతీతం కాదన్న వాదన బలపడుతోంది. జస్టిస్ గొగొయ్ వివాదంలో అందరికీ ఒకే న్యాయం అనే సూత్రం అటకెక్కిందన్న విమర్శ బలపడుతోంది. జస్టిస్ గొగొయ్ పై వచ్చిన ఆరోపణల్లో నిజాల నిగ్గుతేల్చాల్సిందేనని సుప్రీంకోర్టు లాయర్లు పట్టుబడుతున్నారు.

ఆనాడు సుప్రీం చెప్పిన మాటే….
ఆడవారు పనిచేసే చోట వేధింపులకు గురైనట్లు ఆరోపణలు వస్తే వాటిపై విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు గతంలో కొన్ని నిబంధనలు రూపొందించింది. ‘విశాఖ గైడ్ లైన్స్’గా న్యాయవ్యవస్థలో ఇవి పాపులర్ అయ్యాయి. చీఫ్ జస్టిస్ పై ఆరోపణలు చేసింది గతంలో ఆయన దగ్గర పనిచేసిన ఓ మహిళ. పని చేసే చోట్ల ఆడవారికి ఎదురైన వేధింపులలాగానే మాజీ ఉద్యోగిని ఆరోపణలనుకూడా చూడాలంటున్నారు లాయర్లు. గొగొయ్ఫై వచ్చిన ఆరోపణలకు కూడా ఇవే గైడ్ లైన్స్ వర్తిస్తాయని వారంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జీలపై ఆరోపణలు వస్తే ముందుగా వాటిని విచారించడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆరోపణలపై ‘ఇంటర్నల్ కమిటీ’ పేరుతో అంతర్గతంగా విచారణజరిపిస్తారు . ఆరోపణల్లోని నిజానిజాలను నిగ్గు దేలుస్తారు. అయితే తనపై వచ్చిన ఆరోపణల విషయంలోజస్టిస్ గొగొయ్ ఈ నిబంధనను తీసి గట్టు మీద పెట్టారన్నది సీనియర్ లాయర్ల వాదన. ఆరోపణలకు గురైన ప్రధాన న్యాయమూర్తి వాటిపై విచారణ చేయడానికి ఏర్పాటు చేసిన బెంచ్ లో తనను కూడా ఓ జడ్జిగా వేసుకోవడాన్ని న్యాయరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అందరికీ ఒకే న్యాయం సూత్రానికి ఇది పూర్తిగా విరుద్ధమని అంటున్నారు.

దీపక్ మిశ్రాని విమర్శించారు…. మరి….
గతంలో దీపక్ మిశ్రా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నప్పుడు ఆయన పనితీరును తప్పుపట్టిన నలుగురు జడ్జీల్లో ఇప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ కూడా ఉన్నారు. రోస్టర్ విధానంపై జస్టిస్ దీపక్ మిశ్రా అవలంబించిన పద్ధతిని ఈ నలుగురు విమర్శించారు. సీనియర్ జడ్జీలను పక్కన పెట్టి ఎంతో కీలకమైన కేసులను జూనియర్ జడ్జీలకు కేటాయిస్తున్నారని నలుగురు జడ్జీలు మండిపడ్డారు. ‘ఆ రోజున దీపక్మిశ్రా చేసిందే ఇవాళ చీఫ్ జస్టిస్ గొగోయ్ చేశార’ని అంటున్నారు.

ప్రత్యారోపణలే సమాధానమా ?
జస్టిస్ గొగొయ్పై ఆరోపణలు చేసిన మహిళ నిజాయితీని ప్రశ్నిస్తూ ప్రత్యారోపణలు రావడం కూడా వివాదాస్పదమైంది. ‘ఆరోపణలకు ప్రత్యారోపణలే సమాధానమా’ అని లాయర్లు ప్రశ్నిస్తున్నారు. మహిళా ఉద్యోగిని ఆరోపణలపై విచారణ జరిపించి ఆమెకు న్యాయం చేయకుండా ఆమెపై ప్రత్యారోపణలు చేయడం ఏ ‘రూల్ ఆఫ్ లా’ కిందకు వస్తుందని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.

కుట్రకామెంట్లు
తనపై వచ్చిన ఆరోపణల విచారణ ను ప్రభావితం చేసేలా గొగొయ్ కామెంట్స్ చేశారన్న విమర్శ కూడా ఈ సందర్భంగా వినిపిస్తోంది. ఆరోపణల వెనుక పెద్దకుట్ర ఉందన్న గొగొయ్ కామెంట్ ను ఇక్కడ న్యాయ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ఆరోపణలపై విచారణ జరిపించడం… జస్టిస్ గొగొయ్ ఆవేదన… ఈ రెండూ వేర్వేరు అంశాలంటున్నారు. ఆరోపణల్లో పస లేకపోతే గొగొయ్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చంటున్నారు. అయితే ఈ రెండు అంశాలను జోడించడం వల్ల ఆప్రభావం విచారణ జరిపే తీరు పై పడే అవకాశాలున్నాయంటున్నారు. ఆరోపణల నేపథ్యంలో జస్టిస్రంజయ్ గొగొయ్ ఇలా వ్యవహరించి ఉండాల్సిందికాదని లాయర్లు, న్యాయనిపుణులు అంటున్నారు.
–గ్యానంత్​ సింగ్ , అడ్వకేట్, ఢిల్లీ

 

జస్టిస్ గొగొయ్ వివాదం ముదరడంతో ‘బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’కి ఇద్దరు సుప్రీం కోర్టు లాయర్లుఅశీష్ గోయల్, గౌతం భాటియా బహిరంగ లేఖ రాశారు. ప్రజాస్వామ్యా నికి, రాజ్యాం గానికి పునాదివంటి ‘రూల్ ఆఫ్ లా’ని పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ లేఖలో… జస్టిస్ గొగొయ్కి సుప్రీం కోర్టు జడ్జీలందరూ మద్దతుగా నిలవడం సబబుకాదు. ఆరోపణలు రాగానే ‘ఇన్ హౌస్ ప్రొసీజర్‘పద్ధతిలో ‘ఇంటర్నల్ కమిటీ’ని ఏర్పాటు చేసి విచారణ జరిపించాల్సింది. ఈ సంప్రదాయాన్నిపక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ అధికారాలతో తనపైవచ్చిన ఆరోపణలపై విచారించడానికి తానే ఒకబెంచ్ ఏర్పాటు చేసి, అందులో తనను కూడా ఓజడ్జీగా జస్టిస్ గొగోయ్ వేసుకున్నారు. ఈపరిణామాన్ని అందరికీ ఒకే న్యాయం సూత్రాన్నిఅపహాస్యం చేయడం కాక మరేమంటారు? జస్టిస్ గొగొయ్ పై ఫిర్యాదు చేసిన మహిళ చరిత్రను అటార్నీ జనరల్, సొలిసి టర్ జనరల్ తవ్వి తీయడానికి ఎందుకు తాపత్రయపడుతున్నారు ? జస్టిస్ గొగొయ్ పైవచ్చిన ఆరోపణలన్నీ నిరాధారం అంటూ బార్కౌన్సిల్ చైర్మన్గా ఉన్న వ్యక్తి సర్టిఫికెట్ ఇవ్వడంకూడా ‘రూల్ ఆఫ్ లా ’ కు విరుద్ధమే. లాయర్ల వృత్తికి సంబంధించిన అత్యున్నత వేదిక అయినబార్ కౌన్సిల్ తరఫున ఒక వైపు కొమ్ము కాస్తూ స్టేట్మెంట్లు ఇవ్వడం మానుకోవాలి. తనపై ఫిర్యాదు వస్తే, ఆరోపణలకు గురైన వ్యక్తే న్యాయమూర్తిగా ఉండటం అందరికీ ఒకే న్యాయం తుంగలో తొక్కడమే. సంస్కరణలకు వెన్నుదన్నుగానిలవాల్సి న బార్ కౌన్సిల్ న్యాయసూత్రాలకుభిన్నంగా వ్యవహరిస్తోంది’.
– ఆశీష్‌ గోయల్‌‌‌‌, గౌతం భాటియా,సుప్రీం కోర్టు లాయర్లు.

ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులు

దేశవ్యాప్తంగా దుమారం రేపిన ‘మీ టు’ ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో ఎందరో ప్రముఖుల పేర్లు వినిపించాయి. సీనియర్ జర్నలిస్టు ఎం.జె.అక్బర్పై ‘మీ టు’ ఆరోపణలు రావడంతో కేంద్ర మంత్రిపదవికి ఆయన రాజీనామా చేశారు. సిన్మా రంగానికి చెందిన వారిలో నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకుడు సుభాష్ కుమార్, మ్యూ జిక్ డైరెక్టర్ గోపి సుందర్ సహా పలువురిపై ఆరోపణలు ఉన్నాయి.‘మీటూ’ ఉద్యమం క్రీడారంగాన్ని కూడా తాకింది. బీసీసీఐ ప్రముఖుడు రాహుల్ జోహ్రీ, శ్రీలంక క్రికెటర్అర్జున రణతుంగ, స్టార్ బౌలర్ మలింగపై కూడా వేధింపు ఆరోపణలు వచ్చాయి.