
హైదరాబాద్, వెలుగు: టెస్ట్ ప్రిపరేషన్ కంపెనీ అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్‌కు తమ కార్యకలాపాలను విస్తరించింది. నీట్, జెఈఈ ఆశావాహుల కోసం కార్యకలాపాలను విస్తృతం చేస్తుంది. తొలి దశలో భాగంగా హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల్లో ఐదు కొత్త క్యాంపస్‌లను అలెన్ ప్రారంభిస్తోంది. వచ్చే మూడేళ్లలో 20 వేల మంది విద్యార్థులకు ఈ కేంద్రాలు సేవలు అందించనున్నాయని అంచనా. కార్యక్రమానికి చీఫ్గెస్టుగా వచ్చిన జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ క్రమశిక్షణకు మారుపేరు అన్నారు.