బీఆర్ఎస్ అక్రమాలను వెలికి తీస్తా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి​

నిర్మల్, వెలుగు:  బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలన్నింటినీ వెలికి తీస్తామన్నామని ఆ పార్టీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి​ అన్నారు.  శుక్రవారం నిర్మల్ లో నామినేషన్   దాఖలు చేసిన అనంతరం ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తో  కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందన్నారు. 

బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ర్యాలీకి హాజరైన జనాన్ని చూసి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు  ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.  బీఆర్ఎస్ కనుమరుగు కాబోతోందన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో  కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమకు విజయ సోపానాలు కాబోతున్నాయన్నారు.