విజయోత్సవాలు కాదు.. వంచనోత్సవాలు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాల నపై ఆ పార్టీ రాష్ట్రంలో విజయోత్సవాలు నిర్వహిస్తోందని,11 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏం సాధించారని బీజేపీఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఇవి విజయోత్సవాలు కాదని, వంచనోత్సవాలు అని తెలిపారు. ఈ ఏడాది పాలనలో  సీఎం రేవంత్ రెడ్డి ఆయన సహచార మంత్రులు మాత్రమే బాగుపడ్డారని విమర్శించారు. 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 11 నెలల్లో ఎం సాధించిందో రేవంత్ రెడ్డి చెప్పాలని... అదే 11 నెలల్లో రాష్ట్రం ఎలా నష్టపోయిందో తాము చెప్తామని సవాల్ చేశారు. హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ ఏం ముఖం పెట్టుకుని ఈ వేడుకలు నిర్వహిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.