
కరీంనగర్ టౌన్, వెలుగు: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో ఆల్ఫోర్స్ అన్ని విభాగాల్లో జయకేతనం ఎగురవేసిందని చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అత్యుత్తమ విద్యను అందించడం ద్వారా విద్యార్థులు మంచి మార్కులను సాధించారని చెప్పారు. అనుభవజ్ఞలైన లెక్చరర్లతో పాఠాలను బోధించడం, విద్యార్థుల కృషితోనే ఈ సక్సెస్ సాధ్యమైందని పేర్కొన్నారు.
సెకండ్ ఇయర్ బైపీసీలో
జె.అంజనా 997, ఎంపీసీలో కె.రుత్విక్ 996, పి. శ్రీనిత్యరెడ్డి 995, యమ్.రుత్విక 995, ఎ.లక్ష్మీప్రస న్న 995 మార్కులు సాధించారని వివరించారు. ఎంఈసీలో వి.అక్షయ్ వర్ధన్ 988, సీఈసీలో బి. గ్రీష్మ 987 మార్కులు సాధించినట్టు వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీలో 20 మంది విద్యార్థులు 468 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని తెలిపారు. బైపీసీలో నభిలాతరీమ్ 438, జోహ మహవీష్ 438, సామా పిరదోష్ 438 మార్కులు, ఎంఈసీలో ఆర్. చిద్విలాస 491, సీఈసీలో పి. భవజ్ఞ 493 మార్కులు సాధించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.