బీఆర్ఎస్​తో పొత్తు ఖాయం.. సీట్లపైనే చిక్కులు

నేలకొండపల్లి, వెలుగు : రాబోయే ఎన్నికల్లో బీఆర్ ఎస్ ,సీపీఎం, సీపీఐల పొత్తు ఖాయమని  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని కొరట్లగూడెంలో శుక్రవారం జరిగిన డేగల సైదయ్య సంస్మరణ సభకు హాజరైన ఆయన మాట్లాడారు. పొత్తులో భాగంగా సీపీఎం, సీపీఐకి కొన్ని సీట్లు కేటాయిస్తామని సీఎం చెప్పారని, ఏ సీట్లో ఇప్పుడు ప్రకటిస్తే కొన్ని చిక్కులు వస్తాయని  ప్రకటించడం లేదన్నారు. 

కొన్నాళ్లుగా బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తు్న్నాయని కమ్యూనిస్టు పార్టీలు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ కు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీకి.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని.. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నాయి సీపీఎం, సీపీఐ. ఈ క్రమంలోనే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి. సీపీఎంకి పాలేరులో సీటు ఖాయమని బహిరంగంగానే ప్రకటించటం విశేషం.