భారత రాజ్యాంగం శాసన, కార్యనిర్వాహకశాఖలతోపాటు స్వతంత్ర న్యాయశాఖనుఏర్పాటు చేసింది. దీనిఫలితంగా భారతీయులుతమదైన న్యాయం వ్యక్తీకరించుకోవడానికి అవకాశం ఏర్పడింది. న్యాయమైన సమాజాన్నినిర్మించుకునేందుకు రాజ్యాంగ నిర్ణయ సభ సుప్రీంకోర్టును సామాజిక విప్లవ సంరక్షకురాలిగా నిర్వచించింది. హక్కుల కొనసాగింపు కర్తగా,రాజ్యాంగ సంరక్షకురాలిగా ఉన్నప్పటికీ న్యాయవ్యవస్థను సూపర్ శాసనవ్యవస్థగానో, సూపర్ కార్యనిర్వాహకవర్గంగానో, తమ పిడివాదంగానో దీన్ని మార్చరాదని సుప్రీంకోర్టు నిర్మాతల్లో ఒకరైన ఏకే అయ్యర్ భావించారు. ఏది ఏమైనా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కాలానుగుణంగా ఎప్పటికప్పుడు సరిచేయడంతో పాటు, ఆ ప్రభుత్వం పనికిరానిదిగా మారకుండా చూడటం న్యాయవ్యవస్థ బాధ్యతగా భావించాలి.ఉదాత్తమైన ఆదర్శాలతో సుప్రీంకోర్టు ఏర్పడి,వాటికి అనుగుణంగా పనిచేసినప్పటికీ అనేక సందర్భాలలో స్వతంత్రతను కోల్పోయి తన స్థానాన్నితానే తగ్గించుకునే స్థితి ఏర్పడిందని అభిప్రాయాలు వచ్చాయి.
ప్రధానంగా న్యాయమూర్తుల నియామకం మొదలు, కొలీజియం వ్యవస్థ, జస్టిస్ కర్ణన్ కు జైలు శిక్ష, చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా రోస్టర్ పద్ధతి నిర్ణయం, దానికి ప్రతిగా సంప్రదాయక బంధాలు తెంచుకుని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వం లో ప్రతిఘటన, కేసులను వివిధ బెంచీలకు మార్చడం, మద్రాస్ హైకోర్టు జస్టిస్ సుభాషణ్రెడ్డి వివాదం, న్యాయమూర్తి గంగూలీపై లైంగిక వేధింపులు, వి.రామ స్వామి, సౌమిత్రిసేన్ పైఅవినీతి ఘటనలు, డానియల్ దినకరణ్ అవినీతిఘటన, జస్టిస్ నాగార్జునరెడ్డి తీర్పులు వివాదంతో పాటు సోహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్‌ను విచారిస్తున్న సీబీఐ జడ్జి లోయా మరణం, తాజాగా చీఫ్ జస్టిస్రంజన్ గొగోయ్ పై లైంగి క వేధింపుల ఆరోపణలు న్యాయవ్యవస్థ పనితీరును చక్ర బంధంలోకినెట్టివేశాయి.ఇటీవలి కాలంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఆరోపణలలో ముఖ్యమైనది లైంగిక వేధింపుల ఆరోపణలు. భారత న్యాయవ్యవస్థ,స్వతంత్రతను, కీర్తి ప్రతిష్ఠలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో వివిధ హైకోర్టులలో,సుప్రీంకోర్టులలో పనిచేస్తున్న న్యాయమూర్తులపై లైంగి క ఆరోపణలు రావడం విచారకరం,బాధాకరం. తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పైనే లైంగిక వేధిం పుల ఆరోపణలు రావడం భారత న్యాయవ్యవస్థనుసంక్షోభంలోకి నెట్టివేశాయి.
చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్
ఈశాన్య భారతం నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవికి ఎంపికైన తొలి వ్యక్తి రంజన్ గొగొయ్. అతని తండ్రి కేశవ చంద్రగొగొయ్ అస్సాం ముఖ్యమంత్రిగా సేవలందించారు. జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రంజన్ గొగొయ్ అడుగుపెట్టారు . గతంలో ముగ్గురు సీనియర్జడ్జిలతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి భారత న్యాయ చరిత్రలో కొత్త సంచలనానికి తెరలేపారు.
లైంగిక ఆరోపణలు
చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ తనను లైంగి కంగావేధిం చారని సుప్రీంకోర్టులో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన ఓ మహిళ ఆరోపిం చారు.తాను 2014 మే 1 నుంచి 2018 డి సెంబర్వరకు సుప్రీంకోర్టు జూనియర్ అసిస్టెంట్ గా పనిచేశానని పేర్కొన్నారు . ఏకంగా తన నివాస కార్యాలయంలోనే గొగొయ్ తనపై లైంగిక వేధింపులకు దిగారని ఆమె సుప్రీంకోర్టులోని 22 మంది న్యాయమూర్తులకు ఏప్రిల్ 19న లేఖ రాయడం దేశ న్యాయవ్యవస్థలో కలకలంరేపింది. తన ఆరోపణలపై విచారణ కోసం విశ్రాంత సుప్రీం న్యాయమూర్తులతో ప్రత్యేకకమిటీ వేయాలని అభ్యర్థించారు.
విచారణ కమిటీ
జస్టిస్ రంజన్ గొగొయ్ పై వచ్చి న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన ఒక అంతర్గత విచారణకు సీ జేఐజస్టిస్ రంజన్ గొగొయ్ ఆదేశించారు. సీజేఐ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేయే అత్యంత సీ నియర్.తన తర్వాత సీనియర్ న్యాయమూర్తులైన జస్టిస్ ఎన్ వీ రమణ, జస్టిస్ ఇందిరా బెనర్జీలు ఇందులో సభ్యులుగా ఉన్నారు . కానీ ఈ కమిటీ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ తప్పుకున్నారు .జస్టిస్ రమణ, జస్టిస్ రంజన్ గొగోయ్ కుటుంబ స్నేహితులని, అయన విచారణలో న్యాయం జరగదని లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో జస్టిస్ రమణ తప్పుకున్నారు . దీంతో బాధిత మహిళ కోరిక మేరకు జస్టిస్ ఇందు మల్హొత్రాను నియమించారు.ఇదిలా ఉండగా జస్టిస్ రంజన్ గొగొయ్‌ని లైంగిక ఆరోపణ కేసులో ఇరికించడానికి కుట్ర పన్నారని న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ ఆరోపించారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.సీజేఐపై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులోజరుగుతున్న విచారణతో ఈ కమిటీకి సంబంధమేమీ ఉండదని, ఆ ఆరోపణలపై అంతర్గత విచారణ ఎప్పట్లానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. జస్టిస్ పట్నాయక్ కమిటీ సీల్డ్ కవర్‌లో కోర్టుకు రిపోర్టు సమర్పిస్తుందని తెలిపిం ది.
క్లీన్ చిట్
లైంగిక వేధింపుల కేసులో చీఫ్ జస్టిస్ ఆఫ్ఇండియా రంజన్ గొగొయ్ కి సుప్రీంకోర్టు అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిం ది.తనను గొగొయ్ లైంగి కంగా వేధించారంటూ సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జస్టిస్ ఏఎస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిర్థారించింది.రానున్న రోజుల్లో చాలా ముఖ్యమైన కేసులు విచారించనందున ఈ ఆరోపణలు చేశారని సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ ఆరోపించారు.
జస్టిస్ ఎస్‌కే గాంగ్లే
మధ్యప్రదేశ్ హైకోర్టులోని గ్వాలియర్ బెంచ్ హెడ్ జస్టిస్ ఎస్‌కే గాం గ్లేపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రాజ్యసభలో తీవ్రదుమారం రేగింది. దీనిపై 2015 మార్చి 4న 58 మంది రాజ్యసభ సభ్యులు సదరు న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నట్లు అప్పటి రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ కి తెలిపారు.దీం తో అన్సారీ జడ్జిస్ ఎంక్వైరీ చట్టం –1968 ప్రకారం ముగ్గురు యమూర్తులైన జస్టిస్ ఆర్ భానుమతి, ముంజులా చిల్లా ర్, కేకే వేణుగోపాల్‌తో కూడిన ఎంక్వైరీ కమిటీని నియమించారు.ఈ కమిటీ జస్టిస్ గంగూలీపై వచ్చి న ఆరోపణలు నిర్ధారిం చడానికి బలమైన ఆధారాలు లేవని పేర్కొంది. జస్టిస్ గాంగ్లేకి క్లీన్ చీట్ ఇచ్చింది.