డ్రగ్స్ మత్తులో మొసళ్లు!! ..నీళ్లలోంచి దూసుకొస్తున్నయ్

డ్రగ్స్ మత్తులో మొసళ్లు తూగుతున్నాయి. నీటి మడుగుల్లోంచి జనావాసాల్లోకి దూసుకొస్తున్నాయి. అంతటితో ఆగకుండా అగ్రెసివ్ గా ప్రవర్తిస్తున్నాయి. కనిపించిన జంతువుల పైనా, మనుషులపైనా దాడులు చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లోని  టెనెస్సీలో మొసళ్ల మత్తు దెబ్బకి జనాలు వణికిపోతున్నారు. జాగ్రత్తగా ఉండాలని జనాలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అదే టైంలో డ్రగ్ డీలర్లకు రిక్వెస్టులు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పోలీసులు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. టెనెస్సీలో డ్రగ్స్ దందా ఎక్కువగా సాగుతుంది. పోలీస్ రైడ్లకు భయపడి డీలర్లు ఆ డ్రగ్స్ టాయి లెట్లో పడేసి ఫ్లష్ చేస్తున్నారు. ఆ డ్రైనేజీ నీరు ఊళ్ల శివారుల్లో ఉండే నదుల్లోకి, సరస్సులోకి చేరుతుంది. ప్యూరిఫైయర్ల ద్వారా ఆ నీళ్లు మధ్యలోనే శుభ్రమవుతున్నప్పటికీ.. డ్రగ్స్ ఉండే కెమికల్స్ మాత్రం నాశనం కావట్లేదు. ఆ నీటి ప్రభా వంతో బాతులు, రకరకాల చేపలు,మొసళ్లు మత్తు బారిన పడుతున్నా యి. పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నాయి. నార్త్ అలబామాలో గత వారంగా పదిహేను మొసళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకుని, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒకవేళ డ్రగ్స్ నాశనం చేయాలనుకుంటే తమకు సమాచారం అందించాలని డ్రగ్ డీలర్లను కోరుతున్నారు. పోలీసులు. వాటిని తాము సరైన పద్ధతిలో నాశనం చేస్తామని, అరెస్టు లు చేయబోమని అధికారులు, డ్రగ్ డీలర్లకు భరోసా ఇస్తున్నారు.

Also Read:-వానల్లోనే పురుగులు బయటకు ఎందుకొస్తాయి.. మిగతా కాలంలో ఏం చేస్తాయి.. ఎక్కడ ఉంటాయి..?