తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్‌లు

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన అయేషా ఫాతిమా,  మంధారే  సోహం సునీల్, సాయి కిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిని కేటాయించింది.  

ఇటీవల  ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్రానికి అదనంగా ఐపీఎస్‌ అధికారులను కేటాయించాలి అని కోరారు. తెలంగాణకు 76 మంది ఐపీఎస్‌లనే కేటాయించారని తెలిపారు. మరో 29 పోస్టులు కేటాయించాలని కోరారు.

 ఈ మేరకు ఆరుగురు  ఐపీఎస్‌లను ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ముగ్గురు ఐపీఎస్‌లనే కేటాయించింది కేంద్రం.