నిర్మల్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించబోతున్నాయని ఆ పార్టీ నిర్మల అభ్యర్థి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. బీజెపీ, కాంగ్రెస్ పార్టీలు తప్పుడు ప్రచారంతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజలంతా తమ ఓటుతో రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు.