![పట్టుకోవడం చాలా ఈజీ జాగ్రత్త.. ఇక మీ ఇష్టం: తండేల్ పైరసీపై అల్లు అరవింద్ హాట్ కామెంట్స్](https://static.v6velugu.com/uploads/2025/02/allu-aravind-hot-comments-on-tandel-movie-piracy_8kd4npDXhc.jpg)
హైదరాబాద్: నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తండేల్ చిత్రం పైరసీ భూతానికి చిక్కింది. సినిమా విడుదలైన గంటల్లోనే హెచ్డీ ప్రింట్ లీక్ అయ్యింది. వాట్సప్, టెలిగ్రాం గ్రూపుల్లో తండేల్ మూవీ పైరసీ దర్శనమిచ్చింది. కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తే.. గంటల్లోనే పైరసీ లీక్ కావడంపై తండేల్ చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండేల్ సినిమా పైరసీ లీక్ కావడంపై వీరు సోమవారం (ఫిబ్రవరి 10) మీడియాతో మాట్లాడారు. అభిమానులు, మీడియా సహకారంతో తండేల్ సినిమా పెద్ద హిట్ అయ్యింది.. కానీ పైరసీకి గురి కావడం బాధకరమని అల్లు అరవింద్ అన్నారు.
పైరసీ కొన్ని సంవత్సరాలుగా లేదు.. ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ ఛాంబర్, అందరూ చేసిన కృషికి తగ్గింది. కానీ.. మళ్లీ రెండు నెలల నుంచి విచ్చలవిడిగా పైరసీ జరుగుతోందన్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి మళ్లీ పైరసీ ఎక్కువ అయ్యిందన్నారు. ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో కూడా పైరసీ కాపీ వేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు అల్లు అరవింద్.
మళ్లీ విజృంభిస్తోన్న పైరసీ భూతాన్ని నిర్మూలనకు కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్లో కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎక్కువ క్వాలిటీ ప్రింట్ పలు సోషల్ మీడియా గ్రూపులలో రిలీజ్ చేస్తున్నారు.. ఇలా చేస్తే గ్రూప్ అడ్మిన్స్ అరెస్ట్ అవుతారు జాగ్రత్త అని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో పెరిగిన టెక్నాలజీతో అందరినీ పట్టుకోవడం ఈజీ అయిందన్నారు. తండేల్ పైరసీ లీక్‌పై సైబర్ క్రైమ్‌లో కంప్లైంట్ ఇచ్చామని తెలిపారు.
బన్నీ వాసు మాట్లాడుతూ.. పైరసీ లీక్ చేసే వారిపై క్రిమినల్ కేసు పెడతాం.. ఒక్కసారి క్రిమినల్ కేస్ ఫైల్ అయితే యువతకి చాలా ఇబ్బందని అన్నారు.
క్రిమినల్ కేసు ఫైల్ అయితే వెనక్కి తీసుకోలేమని చెప్పారు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులో ఓ సినిమా పైరసీ కాపీ వేశారు.. సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లో పైరసీ ప్రింట్ ప్రదర్శించడం నేరమన్నారు. కేబుల్ ఆపరేటర్స్‌కి కూడా చెబుతున్నాము.. ఒక్క స్క్రీన్ షాట్ బయటికి వచ్చినా కేస్ పెడతామని హెచ్చరించారు.
సోషల్ మీడియా గ్రూపుల్లో పైరసీ ప్రింట్ లీక్ చేసే వారి వివరాలను 9573225069 నెంబర్‌కి పంపాలని కోరారు. వారిపై చట్టపరంగా కేసు పెడతామన్నారు.