కిమ్స్ ఆస్పత్రికలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల రూపాయల పరిహారం ఇస్తున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. హీరో అల్లు అర్జున్ రూ.1 కోటి, డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు, పుష్ప2 నిర్మాతలు (మైత్రి మూవీస్) రూ.50 లక్షలు ఇచ్చారని తెలిపారు. అందరం కలిపి రెండు కోట్లు ఇస్తున్నట్లుగా ప్రకటించిన అల్లు అరవింద్.. రెండు కోట్ల చెక్కును నిర్మాత దిల్ రాజుకు అందజేశారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని ప్రముఖ సినీ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు బుధవారం (డిసెంబర్ 25) పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్యం గురించి డాక్టర్లని అడిగి తెలుసుకున్నారు.
Also Read : రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ శ్రీతేజ్ స్పీడ్ గా రికవర్ అవుతున్నాడని తెలిపారు. అలాగే 72 గంటల నుంచి వెంటిలేటర్ లేకుండా ఉన్నాడని తెలిపారు. ఇక గురువారం ఉదయం 10 గంటలకి సినీ ఇండస్ట్రీ పెద్దలతో కలసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్లు చెప్పారు. ఇందులోభంగా ఇండస్ట్రీలోని సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని వెల్లడించారు.