తండేల్‌‌‌‌‌‌‌‌‌‌ షూటింగ్ షురూ

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌‌‌‌’. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. బుధవారం రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ ప్రారంభమైంది. కర్ణాటకలోని మల్పే పోర్ట్ (ఉడిపి)లో షూటింగ్ జరుగుతోంది.

నాగ చైతన్యతో పాటు ఫైటర్స్‌‌‌‌పై యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. అలాగే ఈ షెడ్యూల్‌‌‌‌లో నటీనటులందరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మత్స్యకారుడిగా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.