పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. మంగళవారం రాత్రి (డిసెంబర్ 17న) శ్రీ తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటికీ శ్రీ తేజ్ మృత్యువుతో పోరాడుతున్నట్లు కిమ్స్ వైద్యులు చేతన్, విష్ణు తేజ్‌లు తెలిపారు.
ఇవాళ డిసెంబర్ 18న శ్రీతేజ్‌ను సినీ నిర్మాత అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ పరామర్శించారు. అక్కడే ఉన్న బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ రాలేకపోయారని వివరించారు. అందుకే అర్జున్ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని అల్లు అరవింద్ స్పష్టం చేశారు. అలాగే రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని అల్లు అరవింద్ హామీ ఇచ్చారు.
ALSO READ | Thandel: తండేల్ సెకండ్ సింగిల్ అప్డేట్.. శివ-పార్వతులకు చై, సాయి పల్లవి సంగీత విందు
అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి.. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చాడు. దీంతో అక్కడ ఫ్యాన్స్ పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు శ్రీ తేజ్ తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. ప్రస్తుతం శ్రీతేజ్ సికింద్రాబాద్ కిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు.