Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక కథనం.. వివిధ పాత్రలు, 22 ఏళ్ల సినీ ప్రస్థానం

Allu Arjun: అల్లు అర్జున్ పుట్టినరోజు ప్రత్యేక కథనం.. వివిధ పాత్రలు, 22 ఏళ్ల సినీ ప్రస్థానం

గంగోత్రి టూ పుష్ప 2. స్టైలిష్ స్టార్ టూ ఐకాన్ స్టార్. ఈ ప్రయాణం అల్లు అర్జున్కు (Allu Arjun) ఎంతో ప్రత్యేకం. మన టాలీవుడ్ నుంచి ఎందరో స్టార్స్ వచ్చారు. మరెందరో తమ స్థానాలను ఇండస్ట్రీలో పదిల పరుచుకున్నారు. కానీ ఏ నటుడికి రాని ప్రత్యేక గుర్తింపు అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. భారతీయ సినిమాకు వందేళ్ల చరిత్ర ఉండగా.. అందులో తెలుగు సినిమాకు 90 ఏళ్ల చరిత్ర కలిగి ఉండటం మన ప్రత్యేకత.

ఆ ప్రత్యేకతలో అల్లు అర్జున్ తన అసాధారణ నటనతో జాతీయ అవార్డు అందుకున్నాడు. దీంతో తెలుగు లోగిళ్ల‌లోకి తొలిసారి జాతీయ అవార్డు (National Film Award) గెలుచుకున్న యాక్టర్గా అల్లు అర్జున్ నిలిచాడు. అందుకే ఈ సినీ ప్రయాణం బన్నీకి చెరగని స్థానాన్ని సంపాదించిపెట్టింది. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ నేడు తన కుటుంబంతో కలిసి ఇంట్లోనే పుట్టినరోజు జరుపుకున్నారు. అల్లు అర్జున్ కేక్ కట్ చేసిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు ఆయన భార్య స్నేహా రెడ్డి. వారి పిల్లలు అయాన్, అర్హ కూడా సెలెబ్రేషన్లలో ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఐకాన్ స్టార్ విశేషాలు:

అల్లు అర్జున్ 22 ఏళ్ల నట ప్రస్థానం పూర్తి చేసుకున్నారు. హీరోగా గంగోత్రి మూవీ (2003) నుంచి పుష్ప 2 ది రూల్(2024) వరకు బన్నీ సినీ ప్రయాణం కొనసాగింది. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అనే బిరుదు నుంచి ఐకాన్ స్టార్ వరకు పేరు తెచ్చుకున్నారు. ఈ వ్యవధిలో ఎన్నో విజయాపజయాలు చవిచూశాడు.

►ALSO READ | తారక్ కు ప్రేమతో.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్

మొదటి సినిమా గంగోత్రితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇది రాఘవేంద్ర రావు 100వ సినిమాగా, అల్లు అర్జున్ డెబ్యూగా వచ్చి ఘనవిజయం సాధించింది. అయితే, ఈ సినిమాలో అల్లు అర్జున్ లేడీ గెటప్లో నటించగా.. చాలా విమర్శలు వచ్చాయి. అయిన, అవేం పట్టించుకోకుండా తన పాత్ర మేరకు ఛాలెంజింగ్గా లేడీ గెటప్ వేశాడు.

ఇక లేటెస్ట్ పుష్ప 2 లో గంగమ్మ తల్లి జాతరలో కట్టిన చీర, ఆ స్వాగ్, ఆ పౌరుషం, అగ్గిరేపేలా కళ్ళు.. ఇవన్నీ చూస్తే అమ్మవారే పూనింది అనేలా తన రూపాన్ని మార్చుకున్నాడు. గంగోత్రి టైంలో విమర్శించినోళ్లు, పుష్ప 2తో నోరెళ్లబెట్టారు. అలాంటి ప్రయాణాన్ని బన్నీ కొనసాగించాడు.

వివిధ పాత్రలు:

ఆర్య, ఆర్య-2, పరుగు, బన్నీ,హ్యపీ, వంటి కమర్షియల్‌ సినిమాల మధ్యలో 'వేదం' వంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ సినిమాలో నటించి యాక్టర్‌గా మరో మెట్టు ఎదిగాడు. గోన గన్నారెడ్డి వంటి చరిత్ర యోధుడి పాత్రలో నటించి ఎంతో వైవిధ్యతను చాటుకున్నాడు. పుష్ప, పుష్ప 2తో చెప్పేదేముంది.. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరాడు. ప్రపంచమంతా ప్రశంసలు ఇచ్చే స్థాయికి చేరాడు.

పుష్ప-2 రికార్డులు:

అంతేకాకుండా పుష్ప-2తో ఇండియా వైడ్ రికార్డులు కొల్లగొట్టాడు. బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 తో టాలీవుడ్ రేంజ్ ను చూపించాడు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రూ.1740.95 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్ సాధించింది. అందులో ఇండియా వైడ్ గా రూ.1234 కోట్ల షేర్ వసూళ్లు చేసింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్, అట్లీ చెప్పిన కథలకు ఒకే చెప్పాడు. నేడు ఐకాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. త్రివిక్రమ్ సినిమాను సితార బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. 

Advertisement