గుణశేఖర్ దర్శకత్వంలో అపురూప ప్రేమకావ్యంగా తెరకెక్కిన ‘శాకుంతలం’ థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ ట్విట్టర్ ద్వారా మూవీ టీంకు ఆల్ది బెస్ట్ చెప్పాడు. అదేవిధంగా తన కూతురు అర్హను ఈ సినిమాతో సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయడంపై సంతోషం వ్యక్తం చేశాడు. అర్హ ను ఎంతో అపురూపంగా చూసుకున్నారని.. ఈ క్షణాలను ఎప్పటికీ మరువలేనంటూ దర్శకుడికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు.
సమంత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో భరతుడిగా బన్నీ ముద్దుల కూతురు నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రకు డబ్బింగ్ కూడా తానే చెప్పుకుంది. స్పష్టమైన తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచేదని విడుదలకు ముందే మూవీ టీం ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. సినిమాలో సైతం ఈ అల్లువారి వారసురాలు అదరగొట్టేసిందట. చివరి 15 నిమిషాలు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసిందని అప్పుడే ప్రేక్షకులు రివ్యూలు ఇచ్చేస్తున్నారు.