అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గురించి తెలిస్తే అవాక్కవుతారు..

అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ గురించి తెలిస్తే అవాక్కవుతారు..

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుక్రవారం తన నివాసంలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ అడ్వకేట్ ఎస్ నిరంజన్ రెడ్డి ఈ కేసుని వాదించాడు. ఈ క్రమంలో లా పాయింట్లు లాగుతూ వాదించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన 24 గంటలు కూడా గడవకముందే బెయిల్ మంజూరు  చేయించాడు. ఈ వీడియో కూడా బయటికొచ్చింది. దీంతో అల్లు అర్జున్ కేసుని వాదించిన అడ్వకేట్ ఎస్ నిరంజన్ గురించి ఇంటర్నెట్లో నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. 

అయితే నిరంజన్ రెడ్డి పూర్తిపేరు సిరగపూర్ నిరంజన్ రెడ్డి. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో జన్మించారు. నిరంజన్ రెడ్డి కి చిన్నప్పటినుంచి ఇండియన్ జ్యుడీషియరీ మీద ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో 1992లో పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ లా చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రాక్టీస్ మొదలు పెట్టిన అనతికాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ లోని ప్రముఖుల కేసుల్ని నిరంజన్ రెడ్డి వాదిస్తున్నారు. 

నిరంజన్ రెడ్డికి సినిమాలపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉండేది. అంతేకాదు ప్రస్తుతం రెండు సొంత థియేటర్లు కూడా ఉన్నాయి.  నిరంజన్ రెడ్డి గతంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా కొంతకాలం పనిచేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన మల్టీస్టారర్ ఆచార్య, ఘాజీ (రానా దగ్గుబాటి), గగనం (నాగార్జున) తదితర సినిమాలని నిర్మించాడు. దీంతో నిరంజన్ రెడ్డికి ఇండస్ట్రీతో, ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి.

ఇక నిరంజన్ రెడ్డి రాజకీయాలపరంగా కూడా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో 2022లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. అంతేగాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.