
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.350 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అయితే ఈ మధ్య అల్లు అర్జున్ ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క బిజినెస్ లో పెట్టుబడులు కూడా బాగానే పెడుతున్నాడు. ఈ క్రమంలో థియేటర్స్ బిజినెస్ పై ఎక్కువగా ఆసక్తి చూపుతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు.
అయితే అల్లు అర్జున్ హైదరాబాద్ లోని కోకాపేట్ ఏరియాలో అల్లు స్టూడియోస్ పేరుతో కొత్త సినిమా థియేటర్ ని నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ భూమి పూజ కార్యక్రమాలు కూడా పూర్తయి నిర్మాణ పనులు మొదలైనట్లు సమాచారం. ఈ భూమి పూజ కార్యక్రమంలో అల్లు బాబీ, శిరీష్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ థియేటర్ లో 4కే స్క్రీన్ తోపాటు డాల్బీ సౌండ్ సిస్టం ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ హైదరాబాద్ లోని ఏ థియేటర్ లోనూ డాల్బీ సౌండ్ సిస్టం లేదు. దీంతో అల్లు అర్జున్ కొత్త సినిమా థియేటర్ పై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ అమీర్ పేట్ లో ఏషియన్ సత్యం మాల్ లో భాగస్వామిగా ఉన్నాడు.
►ALSO READ | SSMB29: మహేష్..రాజమౌళి మూవీ రెండు భాగాలు కాదు.. అనౌన్స్ మెంట్ వీడియో రానుంది!
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని స్టార్ సినీ ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు ఆమధ్య నిర్మాత నాగవంశీ తెలిపాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం.