
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-తమిళ దర్శకుడు అట్లీ సినిమా అప్డేట్ వచ్చేసింది. నిర్మాణ దిగ్గజం సన్ పిక్చర్స్ ఈ సినిమాని (AA 22) నిర్మిస్తోంది. నేడు ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 43వ పుట్టినరోజు సందర్భంగా AA22 మూవీ అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్.
అమెరికా లాస్ ఏంజిల్స్ సిటీలోని ప్రముఖ లోలా వీఎఫ్‍ఎక్స్ సంస్థ కార్యాలయంలో ఈ వీడియోను మూవీ టీమ్ షూట్ చేసింది. అల్లు అర్జున్, అట్లీ ఈ స్టూడియోలోకి వెళ్లి టెక్నిషియన్లతో మాట్లాడి, VFX పనులను పరిశీలించారు. అల్లు అర్జున్‍కు వీఎఫ్‍ఎక్స్ టెస్ట్ , 360 డిగ్రీ 3జీ స్కానింగ్ జరిగింది.
Gear up for the Landmark Cinematic Event⚡✨#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir #SunPictures #AA22 #A6 pic.twitter.com/MUD2hVXYDP
— Sun Pictures (@sunpictures) April 8, 2025
హాలీవుడ్ అవుతార్ రేంజ్లో అల్లు అర్జున్ని చూపించబోతున్నట్లు వీడియో ద్వారా తెలుస్తుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ని ప్రపంచస్థాయికి చేర్చేలా అట్లీ చేసే ప్రయత్నం ఆకర్షిస్తోంది. అనౌన్స్మెంట్ వీడియో ద్వారా సినిమా స్థాయిని చూపించే దిశగా ఈ 2:34 సెకన్ల వీడియో సాగింది. ఈ పవర్ ఫుల్ కాంబో కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫ్యాన్స్ అంచనాలకి ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అనౌన్స్‌మెంట్ వీడియో ఉంది.
సైన్స్ ఫిక్షన్ జానర్‌లో:
అనౌన్స్‌మెంట్ వీడియో చూస్తుంటే..సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది ఉండనుందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మూవీని దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని అంచనా. అందులో రూ.200 కోట్ల నిర్మాణ వ్యయంతో పాటు రూ.250 కోట్ల VFX పనులకు కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇక మిగతావి నటి నటుల రెమ్యునరేషన్. మొదటి సారి అల్లు అర్జున్ - అట్లీల సైన్స్ ఫిక్షన్ కలయిక ఎలాంటి అంచనాలు క్రియేట్ చేయనుందనే ఆసక్తి నెలకొంది.
అతి త్వరలో ఈ ప్రాజెక్ట్ కి పనిచేయబోయే టెక్నీషియన్స్ అండ్ నటీనటుల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. సమ్మర్ లో AA22 షూటింగ్ షురూ కానుంది. వచ్చే ఏడాదిలోనే (2026) ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారని టాక్.
ఇకపోతే, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ రూ. 175 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాభాలలో 15% వాటా కూడా తీసుకోనున్నాడట బన్నీ. అయితే అట్లీ కెరీర్‌లో 6వ సినిమాగా వస్తోన్న ఈ మూవీకి రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. వీరి భారీ మొత్తం చూస్తుంటే అట్లీ-ఐకాన్ల బ్రాండ్ ఏంటో అర్ధమవుతుంది.