Allu Arjun,Atlee: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో హీరో శివకార్తికేయన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

Allu Arjun,Atlee: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో హీరో శివకార్తికేయన్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే, అల్లు అర్జున్ మూవీలో శివకార్తికేయన్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలను చిత్ర బృందానికి సన్నిహిత వర్గాలు ఆ పుకార్లను తోసిపుచ్చాయి. ఇంకా, అల్లు అర్జున్ తో అట్లీ చేయబోయేది మల్టీస్టారర్ కాదని స్ప్రష్టం చేశాయి.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. అల్లు అర్జున్‌తో అట్లీ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకోసం అట్లీ టీమ్ నిర్వీరామంగా కష్టపడుతున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ కాంబో సెట్ అయ్యే అవకాశం ఉంది.

ఇకపోతే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. అలాగే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా సాయి అభ్యాంకర్‌తో అట్లీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్ కూడా ఉంది.

ALSO READ | Sreeleela Dating: శ్రీలీల డేటింగ్ రూమర్స్.. ఆ స్టార్ హీరో తల్లి కన్ఫమ్ చేసేసింది!

ఇకపోతే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో అల్లు అర్జున్ మరోసారి ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే, ఈ క్రమంలో అట్లీ ప్రాజెక్ట్ ప్రాధాన్యత సంతరించుకున్నట్లు కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమా కంటే, అట్లీ సినిమానే ముందుగా వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. అట్లీ ఈ మధ్య జవాన్ (Jawan) సినిమా చేసి బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో దర్శకుడు అట్లీకి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో తన తరువాతి అల్లు అర్జున్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.