AA22: అల్లు అర్జున్-అట్లీ సైన్స్ ఫిక్షన్.. స్పెషల్ వీడియోతో అనౌన్స్‌మెంట్.. 20 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్!

AA22: అల్లు అర్జున్-అట్లీ సైన్స్ ఫిక్షన్.. స్పెషల్ వీడియోతో అనౌన్స్‌మెంట్.. 20 ఏళ్ల మ్యూజిక్ డైరెక్టర్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2: ది రూల్’తర్వాత తన చేతిలో ఓ రెండు సినిమాలున్నాయి. అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్, తమిళ దర్శకుడు అట్లీ చెప్పిన కథలకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇందులో ఏ సినిమా ముందుగా రానుందనే అంశంపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది.

AA22 అప్డేట్:

రేపు మంగళవారం (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్-అట్లీ (AA22)ప్రాజెక్ట్ అధికారిక ప్రకటనను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అంతేకాకుండా ఓ వీడియోను సైతం విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇందుకోసం మూవీ టీమ్ వీడియో కోసం కష్టపడుతున్నారట. దాంతో (AA22) సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ఎలా ఉంటుందోననే అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, రేపు రానున్న వీడియోలో సినిమా జోనర్కి సంబంధించిన అప్డేట్ ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. 

AA22 స్టోరీ:

సైన్స్ ఫిక్షన్, యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది ఉండనుందని సమాచారం. ఇందులో అల్లు అర్జున్ రెండు భిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ కాకుండా యువ సంగీత సంచలనం సాయి అభయంకర్ని అట్లీ తీసుకున్నాడట. రేపు రానున్న అనౌన్స్‌మెంట్ వీడియోతో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Also Read:-వరల్డ్ హెల్త్ డే స్పెషల్.. రకుల్ ప్రీత్ సింగ్ హెల్త్ టిప్స్ విన్నారా..

అయితే, కొన్ని రోజులుగా అనిరుధ్ విషయంలో సస్పెన్స్ నెలకొంది. ఎందుకంటే, అట్లీ సినిమాలన్నిటికీ అనిరుధ్ పనిచేస్తూ వచ్చాడు. అందువల్ల AA22లో భాగమవుతాడా? లేదా అనేది చూడాలి. అలాగే ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుందని కూడా వినిపిస్తూ వచ్చింది. కానీ, ప్రియాంకతో ఈ సినిమా మేకర్స్ చర్చలు జరపలేదని, ఆ రూమర్లు ఫేక్ అని సంబంధిత వర్గాల నుంచి సమాచారం వెల్లడైంది. 

ఇకపోతే, ఈ మూవీని సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‍తో నిర్మించనుందని తెలుస్తోంది. సమ్మర్ లో షూటింగ్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాదిలోనే (2026) ఈ మూవీని రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకున్నారని టాక్. రావు రానున్న అప్డేట్ తో మరిన్ని విషయాలు బయటకు రానున్నాయి.

సాయి అభ్యాంకర్:

ప్రముఖ నేపథ్య గాయకులు టిప్పు మరియు హరిణి దంపతుల కుమారుడే సాయి అభ్యాంకర్. 20 ఏళ్ల వయస్సులోనే యువ సంగీత సంచలనంగా మారాడు. ఇప్పటికే తన ప్రైవేట్ ఆల్బమ్‌లతో భారతీయ సంగీత ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు, అవన్నీ చార్ట్‌బస్టర్‌ సక్సెస్ అయ్యాయి.

అభ్యాంకర్ తన మొదటి సింగిల్ 'కచ్చి సెర' వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. 2024 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసిన వీడియో కూడా ఇదే. ఆపై ప్రీతి ముఖుందన్‌తో 'ఆసా కూడా' మరొక బ్లాక్‌బస్టర్ అయింది. ఆ తర్వాత అతను మీనాక్షి చౌదరితో కలిసి 'సితిర పుత్తిరి' అనే మరో మ్యూజిక్ వీడియోలో కనిపించి ఆకట్టుకున్నాడు. 

ప్రస్తుతం సూర్య 45కి మూవీకి సంగీతం అందిస్తున్నాడు. దాంతో పాటు రాఘవ లారెన్స్ నటిస్తున్న బెంజ్, డ్రాగన్ హీరో ప్రదీప్ రంగనాధ్ 4వ సినిమాకి, శింబు 49 మూవీస్ చేస్తున్నాడు.