
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అదేంటంటే,బన్నీ ఒక సామాన్యుడి లాగా..ఓ రోడ్డు పక్కన ఉన్న దాబాలో తన భార్య స్నేహారెడ్డి(Sneha Reddy)తో కలిసి భోజనం చేశాడు.
ఇటీవల ఏపీ ఎన్నికల్లో నిలబడ్డ తన ఫ్రెండ్, వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ చేసేందుకు నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్..తిరిగొచ్చే క్రమంలోనే దాబాలో భోజనం చేసినట్లు తెలుస్తోంది. అది గుంటూరు జిల్లా ఉండవెల్లి సమీపంలోని గురు నానక్ ధాబా అని సమాచారం.
అయితే, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ..ఇలా సింపుల్ గా సామాన్య జనం ఉండే ప్రదేశంలో ఆగి భోజనం చేయడం పట్ల..ఐకాన్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు బన్నీని మెచ్చుకుంటున్నారు. నువ్వు గ్రేట్ అన్న అని కొందరు కామెంట్స్ చేస్తుంటే..బన్నీ అన్న సింప్లిసిటీ అంటే ఇది..'అల్లు అర్జున్ బ్రో..ఏమైనా నువ్ సూపర్’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై అల్లు అర్జున్ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Icon star @alluarjun and his wife #AlluSnehaReddy spotted dining at a dhaba!📸#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/dw0OdKCOIJ
— Telugu FilmNagar (@telugufilmnagar) May 21, 2024
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే..
ప్రస్తుతం బన్నీ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే అల వైకుంఠపురంలో తరువాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరోసారి జతకడుతున్నారు. ఇక ఈ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి,అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.డైరెక్టర్ అట్లీతో ఒక ప్రాజెక్ట్ చర్చలో ఉన్నట్టు సమాచారం.