1000 Crore Club: ఈ ఇద్దరి హీరోలకే 2024 కలిసొచ్చింది.. వెయ్యి కోట్ల బెంచ్ మార్క్తో సరికొత్త రికార్డ్స్

1000 Crore Club: ఈ ఇద్దరి హీరోలకే 2024 కలిసొచ్చింది.. వెయ్యి కోట్ల బెంచ్ మార్క్తో సరికొత్త రికార్డ్స్

ఈ ఏడాది (2024) టాలీవుడ్ లో ఇద్దరు హీరోలకే బాగా కలిసొచ్చిందని చెప్పాలి. వెయ్యికోట్ల బెంచ్ మార్క్ను(1000 Crore Club) అధిగమించి తెలుగు సినిమా సత్తా చాటారు. ఈ రెండు సినిమాలు నార్త్, సౌత్, వరల్డ్ వైడ్ కలెక్షన్ల వర్షం కురిపించాయి. వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898AD (Kalki 2898 AD)సినిమా వెయ్యి కోట్ల బెంచ్ మార్కును దాటింది. అలాగే ఈ ఏడాది చివరలో వచ్చిన పుష్ప 2 (Pushpa 2)కూడా అదే స్థాయిలో దూసుకుపోతుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అనేక రికార్డులు సొంతం చేసుకుంటోంది. దీంతో ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెలుగోడి సత్తాను చాటాయి.

ALSO READ | Funky Casting Call: జాతిరత్నాలు డైరెక్టర్ సినిమాలో నటించాలనుకుంటున్నారా?.. ఇదిగో అవకాశం

ఈ ఏడాది రూ.1200 కోట్ల కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌తో  ‘కల్కి’ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన  సైన్స్ ఫిక్షన్ డ్రామా  ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో విడుదలై  ట్రెమండెస్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఇది ఆరోవది కావడం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

అంతేకాదు ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పలు రికార్డులు నెలకొల్పాయి. అందులో అనూహ్యంగా విజయాన్ని అందుకున్న సినిమాలున్నాయి. అందులో ముఖ్యంగా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు చూస్తే.. 

1.హనుమాన్‌‌‌‌‌‌‌‌
2.టిల్లు స్క్వేర్
3.కల్కి 2898 ఏడీ
4.సరిపోదా శనివారం
5.దేవర
6.లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
7.‘క’ చిత్రం
8.పుష్ప2