Allu Arjun Wedding Anniversary: అల్లు అర్జున్ స్నేహల వివాహ బంధానికి 14 ఏళ్లు.. కేక్ కట్ చేస్తూ ఫోటోలు షేర్

Allu Arjun Wedding Anniversary: అల్లు అర్జున్ స్నేహల వివాహ బంధానికి 14 ఏళ్లు.. కేక్ కట్ చేస్తూ ఫోటోలు షేర్

అల్లు అర్జున్ స్నేహారెడ్డిల (Allu Arjun Sneha Reddy)  వివాహ బంధానికి (2025 మార్చి 6కి) పద్నాలుగు సంవత్సరాలు. ఈ సందర్భంగా గురువారం (మార్చి 6న) తమ 14వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.

లేటెస్ట్గా అల్లు స్నేహారెడ్డి తన ఇంస్టాగ్రామ్లో పెళ్లి వేడుక జరుపుకున్న ఫొటోస్ను షేర్ చేసింది. ఇంట్లోనే అయాన్ మరియు అర్హతో కలిసి ఈ బ్యూటిఫుల్ కపుల్స్ ప్రేమగా కేక్ కట్ చేశారు. అయితే, గతంలో జరిగిన చాలా వివాహ వార్షికోత్సవాలకు అల్లు అర్జున్, స్నేహ విదేశాలకు సెలవులకు వెళ్లేవారు. కానీ ఈసారి, ఈ జంట తమ ఇంట్లోనే సన్నిహితంగా వేడుక జరుపుకున్నారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో ఐకాన్ ఫ్యాన్స్ తమ స్టార్ కపుల్స్కు పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ విషెష్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే, అల్లు అర్జున్ స్నేహారెడ్డిల వివాహం మార్చి 6, 2011న జరిగింది. అయాన్ మరియు అర్హా అనే ఇద్దరు పిల్లలు. ఈ పిల్లలిద్దరూ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కొత్త పోస్ట్‌ల ద్వారా కనిపిస్తూ ఆకట్టుకుంటారు. 

ALSO READ | Dilruba Trailer: ప్రేమ గొప్ప కాదు.. అది ఇచ్చే మనిషి గొప్ప.. కిరణ్‌ అబ్బవరం కొత్త సందేశం

ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో మరోసారి జతకడుతున్నారు. ఇక ఈ కాంబోలో ఇప్పటికే జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి,అల వైకుంఠపురంలో వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చి భారీ హిట్ అందుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రకటిస్తారని బన్నీ వాస్ ఇటీవలే తెలిపారు.

ఇక ఆ తర్వాత ఐకాన్ స్టార్, డైరెక్టర్ అట్లీతో ఒక ప్రాజెక్ట్ చర్చలో ఉన్నట్టు సమాచారం. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటిస్తారని టాక్. త్వరలో ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.