ప్రస్తుతం సోషల్ మీడియాలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela) పేరు ట్రేండింగ్లో ఉంది. అందుకు కారణం పుష్ప 2 స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' (Kissik). ఈ సాంగ్ లిరికల్ వీడియో నవంబర్ 24 సాయంత్రం 7:02 గంటలకు రిలీజ్ కానుంది. కాదు.. కాదు.. మ్యూజిక్ చార్ట్‌లను శాసించబోతోంది.
అల్లు అర్జున్ డ్యాన్స్, శ్రీలీల స్పీడ్ ఎలా ఉండనుందో రిలీజ్ చేసిన పోస్టర్ తోనే ఆ హైప్ క్రియేట్ చేశారు. వీరిద్దరి డ్యాన్స్ స్టెప్పులు ఒక రేంజ్లో సెట్ అయ్యాయని.. ఇండియా మ్యూజిక్ బాక్సులు పూనకాలతో ఊగిపోవడం కన్ఫమ్ అని టాక్ వినిపిస్తోంది.
అయితే ఆ పూనకాలకు బలంగా నిలిచే మెస్మరైజ్డ్ సింగర్స్ ఎవరో తెలుసుకోవాలి కాదా. ఈ కిస్సిక్ సాంగ్ను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సింగర్ సుభాషిణి పాడగా.. హిందీలో సుభాషిణి, లోతిక ఝా.. మలయాళంలో ప్రియా జెర్సన్.. బెంగాలీలో ఉజ్జయినీ ముఖర్జీ పాడారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కాగా ఈ క్రేజీ సాంగ్ తో శ్రీలీల టాలీవుడ్ నుంచి నేషనల్ బ్యూటీగా మారే ఛాన్స్ లేకపోలేదనే చెప్పుకోవాలి.
Also Read : 240 దేశాల్లో స్ట్రీమింగ్కు వచ్చిన రానా టాక్ షో
ఇదిలా ఉండగా ఈ పాట కోసం శ్రీలీల రూ.2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్. అయితే పుష్పలోని 'ఉ .. అంటావా' పాటకోసం సమంత దాదాపుగా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన సమంతతో పోలిస్తే శ్రీలీలకి 3 కోట్లు తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది.
Here are the energetic voices of #Kissik that will rule your music charts from Nov 24, 7:02 PM 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) November 22, 2024
Telugu, Tamil & Kannada sung by🎙️ @Sublahshini
Hindi sung by 🎙️ @Sublahshini & @LothikaJha
Malayalam sung by🎙️ #PriyaJerson
Bengali sung by🎙️ @UjjainiMjee
An Icon Star… pic.twitter.com/EfcCFNkDjv