Pushpa2TheRule: పుష్ప ది రూల్ షూట్ అప్‌డేట్..

Pushpa2TheRule: పుష్ప ది రూల్ షూట్ అప్‌డేట్..

స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa2TheRule). ఈ సినిమా టీజర్ కోసం ఆయన ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూసారు. ఇక వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డు వేస్తూ రీసెంట్గా టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కాస్తా దాహం తీర్చారు. కానీ, వాటితో ఫ్యాన్స్ లో అంచనాలు మాత్రం మరింత రెట్టింపు అయ్యాయి. దీంతో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కూడా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  

తాజాగా పుష్ప ది రూల్ నుంచి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. 'షూట్ అప్‌డేట్: ప్రస్తుతం క్లైమాక్స్ కోసం అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్‌ను సుకుమార్ బృందం చిత్రీకరిస్తోంది"..ప్రపంచవ్యాప్తంగా పుష్ప రాజ్ 6 డిసెంబర్ 2024న కలువనున్నాడు..అంటూ క్యాప్షన్ ఇచ్చారు మేకర్స్. 

పుష్ప పార్ట్ 1 కి ఇచ్చిన ఒక్కో సాంగ్ చార్ట్ బ్లాస్టర్ అయింది. ఇక పార్ట్ 1 కి వచ్చిన స్పందన..ఈ సినిమాకి వచ్చిన అవార్డ్స్ దృష్ట్యా..పుష్ప 2 సినిమాపై మరింత బాధ్యత పెరిగింది మేకర్స్ కి. కనుకే, ఈ సినిమాలో రిలీజ్ చేసే పోస్టర్ దగ్గర నుండి టీజర్, సాంగ్స్, ట్రైలర్ వరకు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పుడు షురూ అయిన క్లైమాక్స్ ఎలాంటి పూనకాలు తెప్పించనుందో తెలియాలంటే మరిన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ లో మొత్తం జీరో స్థాయి నుంచి స్మగ్లర్గా మారిన అల్లు అర్జున్ కు..ఇక పుష్ప 2లో స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నా అల్లు అర్జున్ కు తేడా తెలుసుకోవడానికి అందరు ఎదురుచూస్తున్నారు.