![బన్నీ, త్రివిక్రమ్ కాంబో సెట్.. అంచనాలు పెంచుతున్న అనౌన్స్మెంట్ వీడియో](https://static.v6velugu.com/uploads/2023/07/allu-arjun-and-trivikram-movie-officially-started_IYLDWSwHgz.jpg)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram) కాంబోలో రానున్న నాలుగో సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. గీత ఆర్ట్స్(Geetha arts), హారికా హాసిని క్రియేషన్స్(Haarika hassine creations) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వీడియోను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో.. ది డైనమిక్ డ్యూయె నాలుగో సారి కలుస్తున్నారు, ఒక విజువల్ స్పెక్టకులర్ కోసం, ఈ సారి చాలా భారీగా, మీకు అద్భుతమైన సినిమాటిక్ ఫీలింగ్ అందించడం కోసం అంటూ చెప్పుకొచ్చారు మేకర్స్.
ఈ వీడియో చూస్తుంటే.. ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది అనేది క్లియర్ గా అర్థమవుతోంది. అల్లు అర్జున్ కూడా ఇప్పటివరకు కనిపించని ఒక కొత్త అవతారంలో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ భారీ ప్రాజెక్టు కు సంబందించిన ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ వీడియోలో తెలిపారు.
ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం ,మహేష్ బాబు(Mahesh babu)తో గుంటూరు కారం(Guntur kaaram), అల్లు అర్జున్ పుష్ప ది రూల్(Pushpa the rule) సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు కంప్లీట్ అవగానే అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. మరి పాన్ ఇండియా లెవల్లో, భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుందో చూడాలి మరి.