
టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది వచ్చిన పుష్ప 2: ది రూల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ.1900 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రముఖ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే నాగవంశీ మాట్లాడుతూ బన్నీ-త్రివిక్రమ్ సినిమా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిపాడు. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన ఓ గాడ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమా చూసి తెలుగు సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు యావత్ దేశమంతా ఆశ్చర్యానికి గురవుతుందని చెప్పుకొచ్చాడు.
Also Read :- ఐశ్వర్య రాయ్ కారును ఢీకొట్టిన బస్సు.. ఫ్యాన్స్ ఆందోళన
దీంతో అప్పటి నుంచి బన్నీ-త్రివిక్రమ్ మూవీ స్టోరీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇందులో త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ దేవతల సర్వ సైన్యాధ్యక్షుడు కుమారస్వామి పాత్రలో నటించనున్నాడని అలాగే ఈ సినిమాలో పులితో జరిగి కొన్ని ఫైట్ సీక్వెన్స్ బన్నీ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అంటున్నారు. అయితే ఇప్పటివరకూ అల్లు అర్జున్ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ జోనర్ ని టచ్ చేశాడు కానీ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం సినిమా చెయ్యలేదు. మరి కొత్తగా చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.
అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటూ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో కూడా సినిమాలు కమిట్ అయ్యాడు. ఇందులో త్రివిక్రమ్ తో కంటే ముందుగా అట్లీ కుమార్ సినిమా ఉంటుందని ఆమధ్య ప్రముఖ సినీ నిర్మాత రవిశంకర్ తెలిపాడు. బన్నీ- అట్లీ కుమార్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.