త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా స్టోరీ అదేనా... సైలెంట్ గా మొదలెట్టేశారా.?

త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా స్టోరీ అదేనా...  సైలెంట్ గా మొదలెట్టేశారా.?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గత ఏడాది రిలీజ్ అయిన పుష్ప 2: ది రూల్ సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దాదాపుగా రూ.400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.1950 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇందులో హిందీ వెర్షన్ మాత్రమే బాలీవుడ్ లో దాదాపుగా రూ.1000 కోట్లు పైగా కలెక్ట్ చేసింది. దీంతో పలు రికార్డులు క్రియేట్ చేసింది. 

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటించాల్సి ఉంది. దీంతో త్రివిక్రమ్ ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్టు జానపదం బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రాజ్యం, యుద్దానికి సంబందించిన సెట్స్ వేసినట్లు పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అయితే గతంలో ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రాణి రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించాడు. ఆ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఆలు అర్జున్ పాత్రకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. మరి ఈసారి త్రివిక్రమ్ సినిమాతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. అయితే గత ఏడాది పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని సైలెంట్ గా మొదలైంది. ఈ ఏడాది జూన్ లో పట్టాలెక్కనున్నట్లు సమాచారం..

ALSO READ | ఆ హీరోయిన్ కంటే రష్మికకి అన్ని రూ.కోట్లు రెమ్యునరేషన్ ఎక్కువట.. అందుకేనా..?

ఈ విషయం ఇలా ఉండగా గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, అల వైకుంఠపురంలో, స/ఆ సత్యమూర్తి సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రముఖ డైరక్టర్లు అట్లీ కుమార్, కొరటాల శివతో సినిమాలు చేయనున్నాడు. మరోవైపు బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో కూడా సినిమా చేసేందుకు ఇటీవలే ముంబై వెళ్ళొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.