Allu Arjun: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఆ డైరెక్టర్ తోనేనా..?

Allu Arjun: ‘పుష్ప’ చిత్రంతో పాన్‌‌‌‌ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్.. ఇటీవల సంధ్య థియేటర్‌‌‌‌‌‌‌‌ తొక్కిసలాట  వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ కేసు నుంచి వీలైనంత త్వరగా బయటపడాలని చూస్తున్నాడు బన్నీ. ఇదిలా ఉంటే తన  తదుపరి చిత్రం ఎవరి డైరెక్షన్‌‌‌‌లో ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో  నెలకొంది. ఇప్పటికే త్రివిక్రమ్‌‌‌‌తో పాటు, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనూ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. వీటిలో ముందుగా త్రివిక్రమ్ మూవీ మొదలుపెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారని, వచ్చే నెలలో బన్నీకి ఫైనల్ స్ర్కిప్ట్ వినిపించనున్నారని తెలుస్తోంది.   మైథలాజికల్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. మరో మూడు నెలల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని,  అలాగే  బన్నీకి ఉన్న  పాన్ ఇండియా ఇమేజ్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. గీతా ఆర్ట్స్‌‌‌‌తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ కలిసి భారీ బడ్జెట్‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయి. తమన్ సంగీతం అందించబోతున్నాడు. జులాయి, సన్‌‌‌‌ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్‌‌‌‌లో రాబోతున్న నాలుగో సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.