AlluArjun: సంధ్య థియేటర్‌ వద్ద పోలీస్ బందోబస్తుతో.. అల్లు అర్జున్ 'ఆర్య-2' రీ రిలీజ్

AlluArjun: సంధ్య థియేటర్‌ వద్ద పోలీస్ బందోబస్తుతో.. అల్లు అర్జున్ 'ఆర్య-2' రీ రిలీజ్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 మూవీ రీ రిలీజ్ అయింది. అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా నేడు (ఏప్రిల్ 5న) ఆర్య 2 థియేటర్లలోకి వచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ దగ్గర భారీగా పోలీస్లు మోహరించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు పోలీసు బందోబస్తుతో చర్యలు తీసుకుంటున్నారు. గుంపులు గుంపులుగా జనాలు ఉండొద్దని పోలీసులు చర్యలు చేపట్టారు.

డజన్ల కొద్దీ పోలీసులు, చెక్ చేయడానికి బౌన్సర్లు.. ఇలా ఎన్నో జాగ్రత్తల మధ్య ఆర్య 2 నడుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, 2024 డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు పుష్ప-2 ప్రీమియర్ షో ఎలాంటి ఘటనను మిగిల్చిందో అందరికీ తెలిసిందే.  పుష్ప-2 సినిమా చూడటానికి అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకుని వచ్చారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందింది.

Also Read : 11 ఏళ్లు పూర్తి చేసుకున్న‘హృదయ కాలేయం’

అలాగే ఈ ఘటనలో, రేవతి కొడుకు శ్రీ తేజ్ (9) ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతుండటం ఆ ఫ్యామిలీకి ఎంతో లోటుని మిగిల్చింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని అధికంగా జనాలు గుమికూడకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.