Bigg Boss: విన్నర్‌కు ట్రోఫీ.. బిగ్ బాస్ తెలుగు8 గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

Bigg Boss: విన్నర్‌కు ట్రోఫీ.. బిగ్ బాస్ తెలుగు8 గ్రాండ్  ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్!

బిగ్ బాస్ తెలుగు 8 (Bigg Boss Telugu 8) అంతిమ సమరం దగ్గరొచ్చింది. ఫైనల్ వీక్ (15వ వారం) విన్నర్ ఎవరనేది సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్ గెలుపు  కోసం అభిమానులు తమ ఓటింగ్తో తెగ కష్టపడుతున్నారు.

ఆదివారం డిసెంబర్ 15న గ్రాండ్ ఫినాలే నిర్వహించి బిగ్ బాస్ 8 తెలుగు విజేత ఎవరో చెప్పనున్నారు. ఇందుకోసం టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ముఖ్య అతిథిగా రానున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. 

పుష్ప 2 సక్సెస్తో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోన్న అల్లు అర్జున్ని ఫైనల్కి తీసుకురావాలని హౌజ్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ లేదా రేపు ఐకాన్ రాకపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి.. బిగ్ బాస్ షో ఆడియన్స్కి ఫుల్ కిక్ అనే చెప్పుకోవాలి. అయితే.. అల్లు రాకతో తెలుగు బిగ్ బాస్ షోకి వరల్డ్ వైడ్గా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ తర్వాత అల్లు అర్జున్ పాల్గొనే ఫస్ట్ షో.. తెలుగు బిగ్ బాస్ కానుంది.

Also Read:-కొత్త ఏడాదిలో ఇలా: జోస్యం చెబుతున్న సమంత..

ఇక బిగ్ బాస్ స్టేజీపై నాగార్జునతో అల్లు అర్జున్ ఉన్నట్లు క్రియేట్ చేసిన ఒక ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో ఐకాన్ రాకపై  ప్రాధాన్యత సంతరించుకుంది.  అయితే, గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 7కి మాత్రం హోస్ట్ నాగార్జుననే విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ట్రోఫీ అందజేశారు. మరి ఇపుడు నాగార్జున అందిస్తాడా? లేక ఎవరైనా గెస్ట్ వస్తారా అనేది ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 8లో టాప్ 5 ఫైనలిస్ట్‌గా అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఐదుగురు ఉన్నారు. వీరిలో ఎప్పటిలాగే నిఖిల్, గౌతమ్ తమ ఆటతో దూసుకెళ్తోన్నారు. వీరిద్దరే మధ్యే పోటీ ఉండనుంది. అయితే, బిగ్ బాస్ విన్నర్ ఓటింగ్‌లో ఒకే రకమైన పర్సంటేజ్‌తో ఫ్యాన్స్ నుంచి ఓటింగ్ పడుతోంది. ఇక ఈ రెండ్రోజుల్లో ఓటింగ్ ముగియనుంది. ఎవరేలా ఆడుతున్నారో.. ఎవరు చివరివరకు ఉంటారనేది ఊహించడం కష్టమనే చెప్పుకోవాలి.

ఇకపోతే బిగ్‌బాస్ సీజ‌న్ 8 ప్రైజ్‌మ‌నీ ఎంత‌న్న‌ది సండే ఎపిసోడ్‌లో నాగార్జున రివీల్ చేశాడు. ప్ర‌స్తుతం 54 ల‌క్ష‌ల 30 వేల ప్రైజ్‌మ‌నీ ఉంద‌ని చెప్పాడు. కానీ, గ్రాండ్ ఫినాలే వరకు అది పెరగొచ్చు లేదా తగ్గొచ్చనే విషయాన్ని వెల్లడించాడు, ఇక గెలిచిన కంటెస్టెంట్కి కారు కూడా గిఫ్ట్గా ఉంటుందని నాగార్జున‌ తెలిపాడు.