
‘పుష్ప2’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టుపై మంగళవారం క్లారిటీ వచ్చేసింది. తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ వీడియోతో ఈ క్రేజీ కాంబోను అనౌన్స్ చేశారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ఇందులో చూపించారు.
దీనికోసం లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ, హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో ఇంటారాక్ట్ అయినట్టు, అవతార్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ దీనికి వర్క్ చేయనున్నట్టు ప్రకటించారు. అట్లీ రూపొందించనున్న ఫస్ట్ తెలుగు మూవీ, అందులోనూ ప్రెస్ట్రీజియస్ సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండటంతోపాటు ఈ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ఇది అల్లు అర్జున్ నటిస్తున్న 22వ సినిమా కాగా, అట్లీ డైరెక్ట్ చేస్తున్న 6వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఈ ఏడాది చివరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు టీమ్ చెప్పింది. ఇతర నటీనటుల వివరాలను కూడా త్వరలోనే ప్రకటించనున్నారు.