తగ్గేదేలా.. : జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్

తగ్గేదేలా.. : జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్

69వ జాతీయ సినిమా అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్ ను వరించింది. పుష్ప మూవీలో నటనకు ఈ గుర్తింపు వచ్చింది. పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపిస్తారు. అయితే తన మేనరిజం.. నటనకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. తగ్గేదేలా అంటూ గడ్డాన్ని చేతితో తిప్పే మేనరిజం డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. 

పుష్ప మూవీకి ఈసారి అవార్డులు ఖాయం అనే టాక్ మొదటి నుంచి ఉంది. అయితే ఏకంగా అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడికిగా ఎంపిక కావటం.. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

పుష్ప మూవీని మైత్రీ మూవీ మేకర్ నిర్మించింది. పుష్ప పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ తర్వాత.. ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అల్లు అర్జున్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చింది పుష్ప మూవీ.
పుష్ప మూవీలో హీరోయిన్ గా రష్మిక నటించగా.. సుకుమార్ దర్శకత్వం వహించారు.