Allu Arjun Wax Statue: దుబాయ్లో బన్నీమైనపు విగ్రహం.. ఓపెనింగ్‌ ఎప్పుడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  దుబాయ్ వెళ్లారు. పుష్ప–2 షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ సడన్ గా కుటుంబంతో కలిసి దుబాయ్ లో అడుగు పెట్టారు. అక్కడ  మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న తర్వాత మరో విశేష గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా భావించే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో మన అల్లు అర్జున్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. మార్చి 28వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బన్నీ దుబాయ్ వెళ్లారు. ఈ నెల 28న రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించనున్నారు.

Also Read:చరణ్పై తల్లి సురేఖ ప్రేమ చూశారా..పుట్టిన రోజుకు ముందే ఇచ్చేసింది

ఇప్పటికే మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ప్రభాస్‌, మహేష్‌ బాబు మైనపు విగ్రహాలు ఉన్న సంగతి తెలిసిందే! కానీ ఇవి లండన్ మ్యూజియంలో ఉన్నాయి. అల్లు అర్జున్‌ విగ్రహం మాత్రం దుబాయ్‌ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మ్యూజియంలో ఇప్పటి వరకు సౌత్‌ ఇండియాకు చెందిన నటుల విగ్రహాలకు చోటుదక్కలేదు. బన్నీకి మాత్రమే దక్కడం విశేషం.

ఇక అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విషయానికి వస్తే.. 70 ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలోఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 చిత్రంతో పాటు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు.