David Warner: నా సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. వార్నర్‌కు అల్లు అర్జున్ స్పెషల్ విషెస్

డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆసీస్ జట్టులో కీలక ఆటగాడు.. ఒంటి చేత్తో విజయాలందించగల సమర్థుడు. ఇది ఒకవైపు నాణెం మాత్రమే. అతనిలో మరో కళ కుడా ఉంది. అదే రీల్స్ చేయడం. సినిమాల్లోని ఫేమస్ క్యారెక్టర్లకు తన ముఖాన్ని జోడించి రీల్స్ చేయడంలో వార్నర్ మంచి దిట్ట. ఐపీఎల్ ద్వారా ఇండియాలో చాలా ఫేమ్ అయ్యాడు. టిక్ టాక్ లో మన తెలుగు పాటలకు వీడియోస్ చేస్తూ ట్రెండ్ అయ్యారు.

ముఖ్యంగా 2021లో వచ్చిన పుష్ప సినిమాలోని పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదేలే.. అనే వీడియో చేసి ఫుల్ పాపులర్ అయ్యారు వార్నర్. దీంతో వార్నర్, అల్లు అర్జున్ మధ్య మంచి సఖ్యత ఏర్పడింది. అల్లు అర్జున్ పుట్టిన రోజుకు వార్నర్ విష్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపి సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు (అక్టోబర్ 27) వార్నర్ పుట్టిన రోజుకు అల్లు అర్జున్ విషెష్ తెలిపాడు. "నా సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు" అని తన ఎక్స్ ద్వారా తెలిపాడు. 

Also Read : కోహ్లీ ఏం చేస్తున్నావ్..? ఔటైతే బాక్స్ బద్దలు కొడతావా..

వార్నర్ కెరీర్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మళ్ళీ ఆస్ట్రేలియా జట్టులోకి వస్తానని తన కోరిక బయటపెట్టినప్పటికీ ఆస్ట్రేలియా ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. అయితే బిగ్ బాష్ లీగ్ లో అతను సిడ్నీ థండర్ తరపున ఆడనున్నాడు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2024 ఏప్రిల్ 5 న రిలీజ్ కు సిద్ధంగా ఉంది.