Allu Arjun case : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Allu Arjun case :  అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

అల్లు అర్జున్ అరెస్ట్ పై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. క్రియేటివ్  ఇండస్ట్రీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గౌరవం లేదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ దీనికి నిదర్శనమన్నారు. సంధ్య థియేటర్ ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు.ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి  ఇలాంటి పబ్లిక్ స్టంట్స్ చేస్తుందన్నారు. సినీ ప్రముఖులపై దాడులు చేయడం కాకుండా బాధితులను ఆదుకోవడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో డిసెంబర్ 13న ఉదయం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ చంచల్ గూడ జైల్లో ఉన్నారు.  హైకోర్టు అల్లు అర్జున్‎కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. హైకోర్టు ఆర్డర్ కాపీ ఇంకా ఆన్లైన్‎లో అప్ లోడ్  కాలేదు. దీంతోనే బన్నీ విడుదల లేట్ అయ్యే అవకాశం ఉంది.  ఇప్పటికే అల్లు అర్జున్ తరుఫు న్యాయవాదులు చంచల్ గూడ జైలుకు చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు రూ.50 వేల రెండు పర్సనల్ బాండ్స్ సిద్ధం చేశారు  బన్నీ లాయర్స్.  ఈ రోజు రాత్రికి (డిసెంబర్ 13) చంచల్ గూడ జైల్లోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. జైలులో అల్లు అర్జున్ అధికారులు టీ, స్నాక్స్ ఇచ్చినట్లు తెలిసింది.

ALSO READ : అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రెస్పాన్సిబుల్ గా ఉండాలంటూ కామెంట్స్

 మరోవైపు చంచల్ గూడ జైలు వద్ద భారీగా భద్రతను పెంచారు పోలీసులు. బన్నీ విడుదల నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అల్లు ఫ్యాన్సీ పెద్ద ఎత్తున చంచలగూడ జైలుకు వద్దకు తరలివస్తున్నారు. జైలు నుండి బయటకు వస్తోన్న తమ అభిమాన నటుడికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జైలు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పోలీసులు భారీగా పోలీసులను మోహరించారు.