Allu Arjun Turns 43: ఇంట్లోనే కేక్ కట్ చేసిన అల్లు అర్జున్.. ఫొటో షేర్‌ చేసిన స్నేహారెడ్డి

Allu Arjun Turns 43: ఇంట్లోనే కేక్ కట్ చేసిన అల్లు అర్జున్.. ఫొటో షేర్‌ చేసిన స్నేహారెడ్డి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన 43వ పుట్టినరోజును ఇంట్లోనే ఫ్యామిలీతో  జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేడు (ఏప్రిల్ 8న) అల్లు అర్జున్ కేక్ కట్ చేసిన ఫొటోలను ఆయన భార్య స్నేహా రెడ్డి తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

తన భర్త అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. ఈ సెలెబ్రేషన్లో వారి పిల్లలు అయాన్, అర్హ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. “హ్యాపీ బర్త్ డే అన్నా” అంటూ ఐకాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. 

ఇకపోతే.. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అంటే అల్లు అర్జున్-స్నేహారెడ్డి అనడంలో సందేహం లేదు. స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగా గుర్తింపు పొందుతూనే..సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్లను పెంచుకుంటోంది. 

గతేడాది పుష్ప-2 మూవీతో సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1750 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఏకంగా కేజీఎఫ్, బాహుబలి సినిమాల రికార్డ్‌లను దాటేసింది.

►ALSO READ | AA22: అల్లు అర్జున్-అట్లీ మూవీ అప్డేట్.. అంచనాలు పెంచేలా అనౌన్స్‌మెంట్ వీడియో

నేడు ఐకాన్ బర్త్ డే స్పెషల్గా అట్లీ సినిమా అప్డేట్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్‍లో సర్‌ప్రైజింగ్‍గా వీడియో రిలీజ్ చేశారు. త్రివిక్రమ్తో మరో సినిమా చేయనున్నాడు బన్నీ. ఈ మూవీ అప్డేట్ సైతం నేడు వచ్చే అవకాశం ఉంది.