Allu Arha: పుష్ప ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్..ఆ పాత్రలో అల్లు వారి పాప!

Allu Arha: పుష్ప ఫ్యాన్స్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్..ఆ పాత్రలో అల్లు వారి పాప!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప ది రూల్ (Pushpa the Rule). క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. పుష్ప 2 (Pushpa the Rise) సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ న్యూస్ వినిపిస్తోంది. పుష్ప రాజ్..శ్రీవల్లి పెళ్లితో క్లైమాక్స్ పూర్తిచేసిన సుకుమార్..అక్కడినుంచే సెకండ్ పార్ట్ స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమా స్టార్టింగ్‌లోనే వీరిద్దరికి ఒక బిడ్డ పుడుతుందట. ఇక ఆ పాత్రలో కనిపించబోయే శ్రీవల్లీ కుట్టి కోసం మేకర్స్ ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. పుష్ప కూతురిగా..కనిపించబోయే చిన్నారి సైతం క్రెజీగా ఉండాలని మేకర్స్ ఆలోచించారట. అందుకు సెలెక్ట్ చేసిన ఆ చిన్నారి మరెవరో కాదు..ఐకాన్ స్టార్ కుమార్తె అల్లు అర్హ (Allu Arha).

ఇదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ ఇన్నాళ్లు టాప్ సీక్రెట్‌గా ఉంచాలనుకున్నా..మొత్తానికి ఈ మ్యాటర్ బయటకు లీక్ అయ్యింది. సినిమా రిలీజ్కు ముందే ప్రకటన ఇస్తారో..లేదంటే సినిమాలో డైరెక్ట్గా చూపిస్తారనే విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ఇన్నాళ్లు సోషల్ మీడియాలో చిలిపి ఆటలతో అట్ట్రాక్ట్ చేసిన ఈ తండ్రీకూతుళ్ళు..సినిమాలో ఎలా కనిపిస్తారనే విషయంలో ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అల్లు అర్హ పుష్పలో నటిస్తే చాలు..అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సుక్కు డబుల్ డోస్ పెంచినట్లే అని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు.

ఇప్పటికే సమంతల శాకుంతలం (Shakunthalam) సినిమాలో చిన్నప్పటి భరతుడిగా అర్హ కనిపించి ఆడియన్స్ను మెస్పరైజ్ చేసింది. ఇందులో అల్లు అర్హ పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కేవలం అల్లు అర్హ కోసమే ఈ సినిమా చూసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. అంతేకాకుండా..ఈ అల్లు వారి పాప యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) దేవర (Devara) సినిమాలో కూడా నటిస్తోన్న విషయం తెలిసిందే.