
మాములుగా హీరోలకు, స్టార్స్ కు అభిమానులు ఉండటం సహజమే. అందులో కొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. తమ అభిమాన హీరోలంటే పడి చచ్చిపోతారు. వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రచ్చ రచ్చ చేస్తారు. బ్యానర్స్ కట్టి, పాలాభిషేకాలు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు. అంతేకాదు.. ఆ హీరోతో ఒక ఫోటో దిగాలని ఆశపడుతుంటారు. కానీ, అలాంటి క్షణం వస్తే మాత్రం భావిద్వేగానికి లోనవుతారు.
తాజాగా అలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానికి ఎదురయింది. ఇటీవల అల్లు అర్జున్ తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ని కలిశారు. చిన్నప్పటినుండి అల్లు అర్జున్ అంటే పిచ్చి అభిమానాన్ని పెంచుకున్న అతను ఒక్కసారిగా ఆయన్ని చూడగానే భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ఆనందన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను ఎంతో ఇష్టపడే హీరో తన భుజంపై చేయి వేసి మాట్లాడటంతో మైమరచిపోయాయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ కూడా తన అభిమానిని ప్రేమతో దగ్గరకు తీసుకొని చాలా ఆప్యాయంగా మాట్లాడారు. తన భుజంపై చేయివేసి దగ్గరకు తీసుకున్నాడు. మధ్యలో సెక్యూరిటీ రావడానికి ప్రయత్నిచగా.. అతన్ని ఆపి మరీ మాట్లాడారు అల్లు అర్జున్. దీంతో ఆయనపై సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి.
Touching moment as a diehard fan meets his idol @alluarjun for the first time. #AlluArjun pic.twitter.com/rlIM6nKmEw
— Vamsi Kaka (@vamsikaka) March 15, 2024
ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప 2 సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో.. పార్ట్2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.