అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎఫెక్ట్.. సిద్దార్థ్ సినిమాకి కష్టాలు... పాపం టికెట్లు తెగడం లేదట

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎఫెక్ట్.. సిద్దార్థ్ సినిమాకి కష్టాలు... పాపం టికెట్లు తెగడం లేదట

కోలీవుడ్ హీరో, లవర్ బాయ్ సిద్దార్థ్ హీరోగా నటించిన "మిస్ యూ" సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈక్రమంలో డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమాలో సిద్దార్థ్ కి జోడీగా ప్రముఖ హీరోయిన్ ఆశికా రంగనాథ్ నటించగా తమిళ్ దర్శకుడు ఎన్. రాజశేఖర్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ వచ్చినా థియేటర్స్ లో టికెట్లు తెగడం లేదు. 

అయితే ఇప్పటికే మిస్ యూ సినిమా టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కానీ ఇప్పటివరకూ కేవలం 50 టికెట్లు మాత్రమే సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్ లోని సుదర్శన్ 70MM థియేటర్ లో కేవలం 5 టికెట్లు మాత్రమే సేల్ అయినట్లు సమాచారం. దీంతోసిద్దార్థ్ సినిమాకి తెలుగులో కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. అయితే సిద్దార్థ్ సినిమాపై అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం ఎక్కువగా ఉందని కొందరు నెటిజన్లు అంటున్నారు.

అయితే ఆమధ్య సిద్దార్థ్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురించి మాట్లాడుతూ కొన్ని కామెంట్లు చేశాడు. ఇందులో ముఖ్యంగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి భారీగా వచ్చిన క్రౌడ్ విషయంపై స్పందిస్తూ బీహార్ లాంటి రాష్ట్రాల్లో క్రౌడ్ ని పోగు చెయ్యడం పెద్ద మ్యాటర్ కాదని అన్నాడు. అలాగే పల్లెటూర్లో జేసీబీ మెషిన్ పని చేస్తునప్పుడు ఆటోమేటిక్ గా జనాలు పోగవుతారని అందులో పెద్దగా ఆశ్చర్యం లేదని సెటైరికల్ గా కామెంట్లు చేశాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సిద్దార్థ్ పై గుర్రుగా ఉన్నారు. అలాగే సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ : అల్లు అర్జున్ అరెస్ట్ : చిక్కడపల్లి స్టేషన్ కు దిల్ రాజు, ఇతర డైరెక్టర్లు

ఇటీవలే సిద్దార్థ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడం తనకి ఎంతో సంతోషంగా ఉందని అలాగే అల్లు అర్జున్ కి తాను కూడా పెద్ద ఫ్యాన్ అని క్లారిటీ ఇచ్చాడు. అయితే తాను ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలని వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

ఇప్పుడు మిస్ యూ సినిమాపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ థియేటర్స్ లో క్రౌడ్ ని పోగెయ్యడానికి థియేటర్లముందు జేసీబీ మెషీన్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యంగంగా ట్రోల్ చేస్తున్నారు.