పండగ చేసుకోండి: పుష్ప 2 రిలీజ్కు ముందు ఐకాన్ ఫ్యాన్స్కి మేకర్స్ స్పెషల్ గిఫ్ట్

పండగ చేసుకోండి: పుష్ప 2 రిలీజ్కు ముందు ఐకాన్ ఫ్యాన్స్కి మేకర్స్ స్పెషల్ గిఫ్ట్

పుష్ప పార్ట్ 1- ది రైస్.. ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ అంటూ ఎర్రచందనం స్మగ్లింగ్‌‌ చేసే ‘పుష్పరాజ్‌‌’ పాత్రతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాడు అల్లు అర్జున్. అవార్డుల్లోనూ ‘తగ్గేదేలే’ అంటూ ఇటీవల ఆ పాత్రతో బెస్ట్ యాక్టర్‌‌‌‌గా నేషనల్‌‌ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఓ కూలీగా మొదలైన పుష్పరాజ్.. ఎర్రచందనం సిండికేట్‌‌కి ఛైర్మన్‌‌గా ఎదిగిన క్రమం తెలుగుతో పాటు ఇతర భాషల ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

ఇపుడు పుష్ప 2- ది రూల్తో.. వస్తోన్న పుష్పరాజ్‌‌ మోతకు ఇంటర్నేషనల్ వైడ్గా ట్రెండ్ మొదలైంది. పుష్ప గాడి నడకకు, తనదైన హావభావాలకు వరల్డ్ సినీ ఫ్యాన్స్ అంత ఫిదా అయిపోయారు. ముఖ్యంగా పుష్ప రాజ్ 'తగ్గేదేలే' అన్న పోజుకు ఫిదా అవ్వడమే కాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అనుకరిస్తున్నారు. ఇప్పడిక పుష్ప 2 లోని 'అస్సలు తగ్గేదేలే' అనే అల్లు అర్జున్ పోస్టర్కి ఐకాన్ దునియా అంత దున్నేస్తున్నారు.

ALSO READ | Pushpa 2 vs RRR: ఆర్ఆర్ఆర్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప 2.. నెక్ట్స్ టార్గెట్ ప్రభాస్, యష్!

బుధవారం (డిసెంబర్ 4న) ఐకాన్ ఫ్యాన్స్ కోసం.. పుష్ప2 మేకర్స్ ఈ మూవీకి సంబంధించిన కొత్త సోషల్ మీడియా స్టిక్కర్లను రిలీజ్ చేశారు. #Pushpa2TheRule, #Pushpa2, #AlluArjun, #AssaluThaggedheLe మరియు #WildFirePushpa వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు.. ఐకానిక్ 'పుష్ప రాజ్ తగ్గేదేలే' ప్రత్యేకమైన ఫోజుతో ఉన్న అల్లు అర్జున్ ఎమోజీని షేర్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

గ తంలో ప్రభాస్ సలార్: పార్ట్ 1, మహేష్ బాబు సర్కారు వారి పాట, KGF: చాప్టర్ 2, మరియు చార్లీ 777 వంటి సినిమాలు కూడా అభిమానుల కోసం ప్రత్యేక ఎమోజి ఫీచర్‌లను అందుకున్నాయి. కాగా పుష్ప 2 డిసెంబర్ 5 న గ్రాండ్గా రిలీజ్ కానుంది.