రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో పుష్ప 2 మేకర్స్ పై ఫైర్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్.. ఎందుకంటే.?

రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో పుష్ప 2 మేకర్స్ పై ఫైర్ అవుతున్న బన్నీ ఫ్యాన్స్.. ఎందుకంటే.?

టాలీవుడ్ ప్రముఖ హీరో ఐకాన్ స్థార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2: ది రూల్ సినిమాకోసం వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతోపాటూ అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేపనిలో పడ్డారు. అయితే అల్లు అర్జున్  పుష్ప  2 సినిమా షూటింగ్ జర్నీ ముగిసిందంటూ సోషల్ మీడియాలో తెలిపాడు. దీంతో డిసెంబర్ 05 న పుష్ప 2 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 

అయితే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో మేకర్స్ వింత ప్రయోగాలు చేస్తున్నారు. పుష్ప 2 సినిమాలో సాంగ్స్ తోపాటూ బీజియం స్కోర్ కోసం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకున్నారు. దీంతో దేవిశ్రీ ఇచ్చిన పాటలు క్లిక్ అయినప్పటికీ బీజియం స్కోర్  మాత్రం మేకర్స్ కి నచ్చలేదు. 

దీంతో మరో మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ ని తీసుకున్నారు. తమన్ కూడా ఆమధ్య  పుష్ప 2 లోని కొన్ని సన్నివేశాలకి మాత్రమే బీజియం స్కోర్ ఇచ్చానని మొత్తం సినిమాకి 15 రోజుల్లో బీజియం స్కోర్ ఇవ్వడం తనవల్ల కాదని చెప్పాడు. కానీ తమన్ ఇచ్చిన బీజియం స్కోర్ తో కూడా మేకర్స్ సాటిస్ఫై గా లేకపోవడంతో పుష్ప 2లో ఈ బీజియం వాడనట్లు తెలుస్తోంది. 

ALSO READ | రేణుకాస్వామి మహిళలకు అసభ్యకరమైన వీడియోలు పంపేవాడు : హీరో దర్శన్

ప్రస్తుతం మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్ ని రంగంలోకి దింపి బీజియం స్కోర్ ని కంపోజ్ చేయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు చెయ్యడం కాదని సూచిస్తున్నారు. ఒక్కోసారి ఈ ఇంపాక్ట్ సినిమా రిజల్ట్ పై పడే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందే దాదాపుగా రూ.1060 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేగాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 13500 స్క్రీన్స్ లో పుష్ప 2 భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదొక రికార్డు అని చెప్పవచ్చు. ఇందులో ఓవర్సీస్ లో 5 వేల స్క్రీన్లు ఉండగా, మనదేశంలో 8వేలకి పైగా స్క్రీన్స్ ఉన్నాయి. 

ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా కూడా రిలీజ్ కి ముందే కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే తెలుగులో టికెట్ అడ్వాన్స్ బుకింగ్స్ నవంబర్ నెల చివరి వారంలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.