సంధ్య థియేటర్ ఘటనలో తనపై కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు అల్లు అర్జున్. పుష్ప బెనిఫిట్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి జరిగిన తొక్కిసలాటపై చిక్కడ్ పల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయ్యింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడంపై FIRనమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తెలిపారు సంధ్య థియేటర్ ఓనర్. తొక్కిసలాట, మహిళ మృతిలో తమపై కేసు కొట్టేయాలని కోర్టును ఆశ్రయించారు.
డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య 70MM లో పుష్ప2 ప్రదర్శించిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ పుష్ప-2 ప్రీమియర్ షో చూడటానికి రావడంతో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకు వచ్చారు. దాంతో అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందింది.
ALSO READ | మనోజ్పై దాడి కేసులో మోహన్ బాబు మేనేజర్ కిరణ్ అరెస్ట్..
దిల్సుఖ్నగర్ కు చెందిన రేవతి (39) తన భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీ తేజ్ (9), సన్వీక (7) కలిసి పుష్ప ప్రీమియర్ షో చూడటానికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 mm కు వచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వచ్చిన సమయంలో అభిమానులు థియేటర్ గేటు లోపలికి చొచ్చుకువచ్చారు. ఈ తొక్కిసలాటలో రేవతి, ఆమె కొడుకు శ్రీ తేజలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే పోలీసులు విద్య నగర్ లోని దుర్గ భాయి దేశముఖ్ హాస్పిటల్ కు తరలించారు. అయితే, రేవతి అప్పటికే మృతి చెందగా, శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో బాలుడిని బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు.
ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలని పలు విద్యాసంఘాలు సంధ్యా థియేటర్ దగ్గర ఆందోళనలు చేశాయి. మహిళ మృతి బాధాకరమని..ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన అల్లు అర్జున్ రూ. 25 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు.