Allu Arjun: మరోసారి నాంపల్లి కోర్టుకి వెళ్లిన అల్లు అర్జున్.. అందుకేనా..?

Allu Arjun: మరోసారి నాంపల్లి కోర్టుకి వెళ్లిన అల్లు అర్జున్.. అందుకేనా..?

పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్‌‌కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో షరతులతో కూడిన బెయిల్‌‌ మంజూరు చేస్తూ నాంపల్లి సెకండ్‌‌ మెట్రో పాలిటన్ సెషన్స్‌‌ జడ్జి శుక్రవారం తీర్పు వెల్లడించారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌‌ ఉత్తర్వులు సహా అల్లు అర్జున్ తరుఫు న్యాయవాది వాదనలతో కోర్టు ఏకీభవిస్తూ.. రూ.50 వేలతో రెండు పూచికత్తులపై బెయిల్ మంజూరు చేసింది.

దీంతో శనివారం అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకి వెళ్లి  రెగ్యులర్‌ బెయిల్‌కు సంబంధించిన పూచీకత్తు పత్రాలు సమర్పించాడు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరై  బెయిల్ పేపర్స్ ఫార్మాలిటీస్ పూర్తీ చేశాడు. అయితే రెండు నెలల పాటు ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.  

Also Read : అఖిల్ కోసం మళ్ళీ కొత్త ప్రయోగం చేస్తున్నారా..?

అలాగే పోలీసు ఎంక్వైరీకి సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించింది.