
టాలీవుడ్లో అల్లు అర్జున్-విజయ్ దేవరకొండల బాండింగ్ వెరీ స్పెషల్. వీరిద్దరికీ ఫ్యాన్స్ లో ఉన్న క్రేజ్ పక్కనబెడితే.. ఒకరికొకరు పంపుకునే గిఫ్ట్స్ ఎప్పుడు కొత్తగా ఉంటాయి. అక్కడితో ఆగకుండా సోషల్ మీడియాలో చెప్పుకునే థ్యాంక్స్ విషెష్ తమ ఫ్యాన్స్ కి పిచ్చిపిచ్చిగా నచ్చుతుంటాయి.
లేటెస్ట్గా విజయ్ దేవరకొండ పంపిన ఓ గిఫ్ట్కి బన్నీ ఇచ్చిన రిప్లై ఆకట్టుకుంటోంది. ఇటీవలే విజయ్ తన రౌడీ బ్రాండ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నీకి రౌడీ బ్రాండ్ డ్రెస్‌లను, పిల్లల కోసం కొన్ని బర్గర్‌లను పంపారు. ఈ బహుమతులకు బన్నీ ఫిదా అయ్యారు.
తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో, అల్లు అర్జున్ ఆ సర్‌ప్రైజ్ యొక్క ఒక చిన్న క్లిప్‌ను షేర్ చేస్తూ.. ‘‘మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్’’అని తన స్టోరీలో బన్నీ రాశారు.
గతంలో పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా అల్లు అర్జున్ కు స్పెషల్ గిఫ్ట్స్ పంపిన విషయం తెలిసిందే. పుష్ప పేరుతో ఉన్న టీ షర్ట్స్ ను పంపి తన అభిమానాన్ని చూపించాడు విజయ్. దాంతో ' మై స్వీట్ బ్రదర్' అంటూ అల్లు అర్జున్ రిప్లై ఇచ్చాడు. ఇకపై మన బంధం ఇలానే కొనసాగుతూ ఉంటున్న అన్న' అంటూ విజయ్ ప్రతిస్పందించాడు.
ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనిలో ఉంది. ఇటీవలే రిలీజ్ చేసిన ఫస్ట్ వీడియో సినిమాపై అంచనాలు పెంచింది. ఆ తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ లో బన్నీ జాయిన్ అవ్వనున్నాడు.
ఇకపోతే విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’లో నటిస్తున్నాడు. ఈ మూవీ మే 30న రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.