హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల విచారణకు నటుడు అల్లు అర్జున్ హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుండి తన తండ్రి, మామ, న్యాయవాదులతో కలిసి బన్నీ చిక్కడపల్లి పీఎస్‌కు వెళ్లారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో చిక్కడపల్లిలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి పీఎస్‌కు 200 మీటర్ల దూరంలో పలు ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలపైన నిషేధం విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పీఎస్ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
ఏసీపీ రమేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం అల్లు అర్జున్ను ప్రశ్నించనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, ఆ రోజు నైట్ జరిగిన పరిణామాలు, పోలీసులు రిలీజ్ చేసిన వీడియో ఫుటేజీ, ప్రెస్ మీట్లో మాట్లాడిన అంశాలపై పోలీసులు బన్నీని క్వచ్చన్ చేయనున్నట్లు సమాచారం. కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్‌పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ11 ముద్దాయిగా బన్నీని చేర్చిన పోలీసులు.. 2024, డిసెంబర్ 24న విచారణకు రావాలని ఆదేశించారు.