విలక్షణ నటుడు రావు రమేష్ (Rao Ramesh) ప్రధాన పాత్రధారిగా పీబీఆర్ సినిమాస్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతీనగర్ సుబ్రహ్మణ్యం’ (Maruti Nagar Subramanyam). లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 23న విడుదల కానుంది.
బుధవారం (ఆగస్ట్ 21న) ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బన్నీ - సుక్కు హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజిపై అల్లు అర్జున్ (Allu Arjun) మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ బన్నీ మాటలను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
"పుష్ప 2 క్లైమ్యాక్స్ చాలా చాలా క్లిష్టమైనది. అది చేస్తూ కూడా ఇక్కడికి (ప్రీ రిలీజ్ ఫంక్షన్కు) వచ్చానంటే ఆమే (సుకుమార్ గారి భార్య తబిత) కారణం. ఆమె ఆహ్వానించిన తర్వాత కాదనలేకపోయాను. ఎందుకంటే ఇష్టమైనోళ్లకి మనం చూపించాలి. మనం నిలబడగలగాలి. మన ఫ్రెండ్ అనుకో, కావాల్సిన వాళ్లనుకో..నాకిష్టమైతే నేనొస్తా. నా మనసుకు నచ్చితేనే వస్తా. అది మీ అందరికీ తెలిసిందే" అని అల్లు అర్జున్ అనగానే అక్కడున్న అభిమానులంతా పెద్దగా అరిచారు.
అయితే, ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడింది సుకుమార్ భార్య ఆహ్వానం మేరకు వచ్చిన అని చెప్పినా..సోషల్ మీడియాలో మాత్రం వైసీపీ శిల్పా రవిచంద్ర రెడ్డికి మద్దతు పలికిన విషయం గురించి మరోసారి ఆయన తన స్టాండ్ వెల్లడించారు అనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ లో మాత్రం..బన్నీ ఈ కామెంట్స్ ఊరికే చేయలేదని, ఇది మెగా ఫ్యామిలీకి అతడు ఇచ్చిన మాస్ రిప్లై అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కూటమి ప్రత్యర్థి అయిన వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తరఫున అల్లు అర్జున్ ప్రచారం చేయడం దుమారం రేపింది తెలిసిందే. దీనిపై బన్నీ క్లారిటీ ఇచ్చినా..అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య దూరం ఉందనే భావన తెలుగు ప్రేక్షకుల్లో ఉంది.