హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసుల విచారణకు హాజరయ్యేందుకు నటుడు అల్లు అర్జున్ బయలుదేరారు. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుండి తన తండ్రి, న్యాయవాదులతో కలిసి బన్నీ చిక్కడపల్లి పీఎస్ వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోనున్నారు. అల్లు అర్జున్ రాక నేపథ్యంలో పోలీసులు చిక్కడపల్లిలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి పీఎస్‌కు 200 మీటర్ల దూరంలో ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలపైన నిషేధం విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పీఎస్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
ALSO READ : అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
ఏసీపీ రమేష్ నేతృత్వంలోని పోలీసుల బృందం అల్లు అర్జున్ను ప్రశ్నించనుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, ఆ రోజు నైట్ జరిగిన పరిణామాలు, ప్రెస్ మీట్ వంటి అంశాలపై పోలీసులు బన్నీని క్వచ్చన్ చేయనున్నట్లు తెలిసింది. కాగా, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ పైన చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో ఏ11 ముద్దాయిగా బన్నీని చేర్చిన పోలీసులు.. 2024, డిసెంబర్ 24న విచారణకు రావాలని ఆదేశించారు.